లోయలో పడిన కారు.. 11మంది మృతి

Published : Mar 16, 2019, 04:02 PM IST
లోయలో పడిన కారు.. 11మంది మృతి

సారాంశం

జమ్మూకశ్మీర్ లోని రాంబస్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 

జమ్మూకశ్మీర్ లోని రాంబస్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న ఎస్ యూవీ కారు.. అదుపు తప్పి.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 11మంది మృత్యువాతపడ్డారు. కాగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 15మంది ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ