100 Terrorists Killed: ఇప్ప‌టివ‌ర‌కూ 100 ఉగ్ర‌వాదుల హ‌తం.. అందులో 63 మంది లాష్క‌ర్లే..

Published : Jun 13, 2022, 02:13 PM IST
 100 Terrorists Killed: ఇప్ప‌టివ‌ర‌కూ 100 ఉగ్ర‌వాదుల హ‌తం.. అందులో 63 మంది లాష్క‌ర్లే..

సారాంశం

100 Terrorists Killed In Kashmir In 2022: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టిన‌ట్టు భద్రతాధికారులు పేర్కొన్నారు. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ముష్కరులు 63 మంది ఉన్నారని తెలిపారు.  

100 Terrorists Killed In Kashmir In 2022: భార‌త్ త‌న స‌రిహ‌ద్దుల్లో శ‌త్రు దేశాలను ఎదురయ్యే స‌వాళ్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటుంది. స‌రిహ‌ద్దుల్లో అక్ర‌మ చొర‌బాట్ల‌కు పాల్ప‌డుతున్న శ‌త్రు సేనాల‌ను ఏరిపారేస్తుంది. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని తుడిచిపెడుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100 మంది ఉగ్రవాదులు హతమొందించింది.

నేడు జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో LeT టెర్రరిస్ట్ హతమయ్యాడు. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లలో భాగంగా ఈ చర్య జరిగిందని తెలిపారు.  జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోలీసులు, భద్రతా బలగాలు సాధించిన పెద్ద విజయంగా పరిగణించారు.వాస్త‌వానికి తీవ్రవాదులు ముఖాముఖి పోరాడకుండా కాశ్మీర్‌లో నివసిస్తున్న వలస పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. కశ్మీరీ పండిట్లను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త ఆపరేషన్‌లో ఉగ్రవాదులు నిరంతరం హతమవుతున్నారు.

క్రిస్బల్ పాల్పోరా సంగం ప్రాంతంలో గత రాత్రి పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో  ఓ ఉగ్రవాది హతమైనట్లు  పోలీసులు తెలిపారు.  అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనుమానాస్పద కదలికలను BSF గుర్తించింది.  జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు (IB) సమీపంలోని ఆర్నియా సెక్టార్‌లో అనుమానాస్పద కదలికను BSF సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు అధికారులకు సమాచారం అందించారు. వారిని ఎదుర్కొనే క్ర‌మంలో దుండగులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి BSF జవాన్లపై ఉగ్ర‌వాదుల కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఈ భార‌త సైన్యం ప్రతీకారం తీర్చుకుంది.  వారిపై బుల్లెట్లను ప్రయోగించింది. సోమవారం ఉదయం నుండి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించబడింది. 

ఈ క్ర‌మంలో కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్  మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదిలో ఇప్పటికే 100 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టున్న‌ట్టు తెలిపారు. వీరిలో పాకిస్తాన్‌కు చెందిన ముష్కరులు 63 మంది ఉన్నారని తెలిపారు. జూన్‌ 12న పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు లష్కరే తోయిబా సభ్యులతో కలుపుకుని.. ఈ ఏడాది ఇప్పటిదాకా పలు ఎన్ కౌంట‌ర్లలో 100 మంది ముష్కరులను ఏరివేసినట్లు తెలిపారు.

సరిహద్దుల్లోకి అక్ర‌మ‌ చొరబాట్లు, రిక్రూట్‌మెంట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సరిహద్దులకు సమీపంలో పాక్‌ ఆర్మీ 12కు పైగా ఉగ్ర శిక్షణ శిబిరాలను తిరిగి ప్రారంభించిందన్నారు. అనేక మంది అమాయ‌కుల‌ హత్యల్లో లష్కర్‌కు కీలకంగా వ్యవహరించిందని , ఈ ఉగ్రవాది హతంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఐజీపీ తెలిపారు.

గతేడాది ఇదే కాలంలో హతమైన ఉగ్రవాదుల సంఖ్య కంటే ఇది రెట్టింపు అని వారు తెలిపారు. గత సంవత్సరం మొదటి ఐదు నెలల 12 రోజుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో  50 మంది ఉగ్రవాదులు హ‌త‌మయార‌ని అధికారులు తెలిపారు. ఈ మొత్తం ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాదుల్లో 63 మంది నిషేధిత లష్కరే తోయిబాకు చెందినవారు కాగా, మరో 24 మంది జైషే మహ్మద్ (జేఈఎం)కి చెందిన వారని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం