కశ్మీర్‌లో రోడ్డుపై విరిగిపడ్డ మంచు చరియలు.. 10 మంది దుర్మరణం

By sivanagaprasad kodatiFirst Published Jan 19, 2019, 7:38 AM IST
Highlights

జమ్మూకశ్మీర్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం లఢఖ్‌లోని ఖర్దుంగా పాస్ వద్ద 10 మంది పౌరులతో వెళుతున్న రెండు ట్రక్కులపై మంచు చరియలు విరిగిపడ్డాయి. 

జమ్మూకశ్మీర్‌లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం లఢఖ్‌లోని ఖర్దుంగా పాస్ వద్ద 10 మంది పౌరులతో వెళుతున్న రెండు ట్రక్కులపై మంచు చరియలు విరిగిపడ్డాయి. భారీగా మంచుపడటంతో సుమారు 20 అడుగుల మేర మంచులో రెండు ట్రక్కులు కూరుకుపోయాయి.  

సమాచారం అందుకున్న పోలీసులు, సైన్యం మంచును తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీయగా... మిగిలిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటన జరిగి ఇప్పటికే 24 గంటలు గడుస్తుండటంతో పాటు మంచులో ఊపిరి తీసుకునే అవకాశాలు లేకపోవడంతో వారు జీవించి ఉండే అవకాశాలు తక్కువేనని అధికారులు చెబుతున్నారు.

click me!