Baramulla grenade blast: బారాముల్లాలో విరుచుక‌ప‌డ్డ‌ ఉగ్రవాదులు.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

By Rajesh KFirst Published May 17, 2022, 11:34 PM IST
Highlights

Baramulla grenade blast: జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లాలో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసరడంతో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.
 

Baramulla grenade blast: జమ్మూకశ్మీర్‌లో మ‌రోసారి ఉగ్రవాదుల దాడికి పాల్ప‌డ్డారు. మంగ‌ళ‌వారం బారాముల్లా జిల్లాలో ఉన్న మద్యం దుకాణంపై ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో  ముగ్గురికి గాయాలు కాగా, ఒకరు మృతి చెందినట్లు సమాచారం. షాపుపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. దాడి తర్వాత ఆ ప్రాంతమంతా స్థానిక భ‌ద్ర‌త బ‌ల‌గాలు ఆధీనంలోకి తీసుకున్నాయి.  

మంగళవారం ముందుగా జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లా నుంచి లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు సహచరులను భద్రతా బలగాలు అరెస్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు సహచరులను బుద్గామ్‌లో పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధులు తెలియజేశారు. ఈ క్ర‌మంలో వారి నుంచి భారీ పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి  ఒక హ్యాండ్ గ్రెనేడ్, పిస్టల్ రెండు మ్యాగజైన్లు, 15 రౌండ్ల ఏకే-47 రైఫిల్, పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. 

సోమవారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాద ముఠాను భద్రతా దళాలు చేధించాయి, ఏడుగురు ఉగ్రవాదులను, వారి సహచరులను అరెస్టు చేశాయి. ఇటీవ‌ల బండిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేస్తున్నప్పుడు భద్రతా దళాలు లష్కరే తోయిబా ముఠాను మట్టుబెట్టాయని పోలీసులు తెలిపారు. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాది సహా ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరితో పాటు ఓ మహిళతో సహా నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు.

 మరోవైపు, అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడానికి హోం మంత్రి అమిత్ షా మంగళవారం భద్రతా స్థాపనలోని ఉన్నతాధికారులతో వరుసగా మూడు సమావేశాలు నిర్వహించారు. ఇటీవల జరిగిన పౌరుల హత్యలు, త్వరలో జరగనున్న అమర్‌నాథ్ యాత్రపై ఈ సమావేశాల్లో చర్చ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలన ఇప్పుడు అమర్‌నాథ్ యాత్ర కోసం ప్రతి యాత్రికుడికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కార్డ్ (RFID) అందజేస్తుందని అధికారులు తెలిపారు.

జూన్ 30 నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్రకు ముందు కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఇక్కడ జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో హోంమంత్రి ఈ విషయం చెప్పారు. సమన్వయంతో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను చురుగ్గా నిర్వహించాలని భద్రతా బలగాలు, పోలీసులను ఆయన ఆదేశించారు.

click me!