మహిళవి కాబట్టి బతికి పోయావ్.... న్యాయమూర్తికే బెదిరింపులు

By telugu teamFirst Published Nov 30, 2019, 7:52 AM IST
Highlights

..దీపా మోహన్ తిరువనంతపురంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఓ ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేసి వారిని రిమాండ్ కు తరలించాల్సిందిగా మంగళవారం తీర్పు ఇచ్చారు. 

న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు మనం ఎంతో గౌరవం ఇస్తాం. న్యాయమూర్తి ఇచ్చిన  తీర్పుకి ని కూడా అందరూ గౌరవిస్తారు. అలాంటిది.. ఓ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుని న్యాయవాదులే వ్యతిరేకించడం గమనార్హం. ఓ కేసు విషయంలో బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినందుకు న్యాయమూర్తిని న్యాయవాదులు బెదిరించారు. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...దీపా మోహన్ తిరువనంతపురంలో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఓ ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేసి వారిని రిమాండ్ కు తరలించాల్సిందిగా మంగళవారం తీర్పు ఇచ్చారు. దీంతో తిరువనంతపురం బార్ అసోసియేషన్ కి చెందిన 12మంది న్యాయవాదులు తన ఛాంబర్ లోకి వచ్చి ఆమెను తీవ్రంగా దూషించడం గమనార్హం.

మహిళవు కాబట్టి బతికి పోయావు... లేదంటే నిన్ను ఛాంబర్ నుంచి బయటకు లాగి కొట్టేవాళ్లం అంటూ ఆమెను న్యాయవాదులు బెదిరించారు. దీంతో... ఆమె వారిపై ఫిర్యాదు చేశారు. ‘‘ నిందితులు నా గది తులపులు మూసివేసి, బయటకు ఎలా వస్తావో చూస్తాం అంటూ బెదిరించారు. కక్షిదారులను కోర్టు ఖాళీ చేయాలని చెప్తూ ఈ రోజు నుంచి కోర్టు పనిచేయదన్నారు. ప్రభుత్వ ఉద్యోగిని అయిన తనను విధులు నిర్వహించకుండా అడ్డుకున్నారు’’ అంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

click me!