రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి... స్మృతీ ఇరానీ డిమాండ్

By telugu teamFirst Published Dec 13, 2019, 12:55 PM IST
Highlights

శుక్రవారం సభ ప్రారంభం కాగానే.. బీజేపీ మహిళా ఎంపీలు ఈ విషయాన్ని చర్చకు తీసుకువచ్చారు. ‘ మేకిన్ ఇండియాను అత్యాచాలతో పోలీస్తూ ఓ రాజకీయ నేత వ్యాఖ్యలు చేడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదేనా రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం.’ అంటూ స్మృతీ ఇరానీ మండిపడ్డారు.

ప్రపంచంలోనే రేప్‌లకు భారత్ రాజధానిగా మారుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ సమావేశాల్లో బీజేపీ మహిళా ఎంపీలంతా... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఇటీవల కాలంలో జరిగిన వరస అత్యాచార ఘటనలపై ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు నేడు లోక్ సభలో దుమారం రేపాయి.

శుక్రవారం సభ ప్రారంభం కాగానే.. బీజేపీ మహిళా ఎంపీలు ఈ విషయాన్ని చర్చకు తీసుకువచ్చారు. ‘ మేకిన్ ఇండియాను అత్యాచాలతో పోలీస్తూ ఓ రాజకీయ నేత వ్యాఖ్యలు చేడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇదేనా రాహుల్ దేశ ప్రజలకు ఇచ్చే సందేశం.’ అంటూ స్మృతీ ఇరానీ మండిపడ్డారు.

‘ అందరు పురుషులు రేపిస్టులు కాదు.. ఇది దేశానికే అవమానం..50ఏళ్లు వస్తున్నాయి రాహుల్ గాంధీకి... కనీసం ఇలాంటి మాటలు మాట్లాడకూడదని తెలీదా’’ అని స్మృతీ ఇరానీ ప్రశ్నించారు.

ఆయనకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీలకు చెందిన మహిళా ఎంపీలు కూడా రాహుల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనల నేపథ్యంలో సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.ఇటు రాజ్యసభలోనూ ఇదే విషయంపై గందరగోళం నెలకొంది. రాజ్యసభలోనూ ఎంపీలు కూడా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

కాగా... నాలుగు రోజుల క్రితం..ప్రపంచంలోనే రేప్‌లకు భారత్ రాజధానిగా మారుతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్‌తో తమ బిడ్డలను, అక్కచెల్లెళ్లను ఎందుకు కాపాడుకోలేకపోతున్నారని విదేశాలు అడుగుతున్నాయన్నారు. యూపీలో ఓ బీజేపీ ఎమ్మెల్యే రేప్ కేసులో నిందితుడిగా ఉన్నా ప్రధానమంత్రి మోడీ కనీసం నోరు మెదపకపోవడం ఘోరమని అన్నారు. ఉన్నావ్ రేప్ బాధితురాలి సజీవ దహనం, హైదరాబాద్ దిశ ఘటనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేరళలోని వాయనాడ్ ఎంపీ అయిన రాహుల్ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం అక్కడ ఓ సభలో మాట్లాడుతూ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. హింసను నమ్మే వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తుండం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కాగా... ఆయన చేసిన కామెంట్స్ పై ఇప్పుడు బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

click me!