అన్నం పెట్టలేదని..సీరియల్ కిల్లర్ ఏం చేశాడంటే...

Published : Aug 26, 2019, 09:45 AM IST
అన్నం పెట్టలేదని..సీరియల్ కిల్లర్ ఏం చేశాడంటే...

సారాంశం

ఈ హత్యలన్ని ఒకే రకంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక విచారణ చేపట్టారు. విక్రమంగళం ప్రాంతములో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

తనకు ఆకలి అవుతుంటే అన్నం పెట్టలేదని ఓ సీరియల్ కిల్లర్ దారుణానికి ఒడిగట్టాడు.  అన్నం పెట్టలేదని ముగ్గురు వ్యక్తులను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....

మదురై జిల్లా ఉసిలంపట్టి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో పలువురు హత్యకు గురయ్యారు. గత ఏప్రిల్‌ 20వ తేదీ ఏళుమలైకు చెందిన వెల్లస్వామి తన తోటలో హత్యకు గురయ్యాడు. గత మే 30వ తేదీ లింగనాయకన్‌పట్టికి చెందిన అయ్యర్‌ దేవర్‌ తోటలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యల గురించి ఉసిలంపట్టి, ఏళుమలై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతూ వచ్చారు. 

ఇలా ఉండగా గత నాలుగవ తేదీన విక్రమంగళం సమీపాన బాల్‌స్వామి అనే వ్యక్తి తన తోటలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలన్ని ఒకే రకంగా ఉండటంతో పోలీసులు ప్రత్యేక విచారణ చేపట్టారు. విక్రమంగళం ప్రాంతములో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

అతను తేని జిల్లా కంభం సమీపాన గల గోవిందన్‌పట్టికి చెందిన వేల్‌మురుగన్‌ (48)గా తెలిసింది. ఇతడే ఆ మూడు హత్యలు చేసినట్టు విచారణలో బయటపడింది. రాత్రి వేళ ఆకలి వేస్తే ఊరు చివరగా ఉండే తోటలకు వెళ్లి అక్కడ తోటమాలిలను అడిగేవాడు. ఆహారం లేదని చెప్పిన వారిని హతమారుస్తూ వచ్చినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వేల్‌మురుగన్‌ను అరెస్టు చేశారు. విచారణలో 2002 సంవత్సరం ఉసిలంపట్టిలో వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో అతను జైలు శిక్ష అనుభవించి 2015లో విడుదలైనట్టు తెలిసింది.

PREV
click me!

Recommended Stories

38 మందికి మరణ శిక్ష గుజరాత్ హై కోర్ట్ సంచలన తీర్పు | Historic Verdict in 2008 Ahmedabad Incident
ఇండోనేషియాలో ప్రంబనన్ ఆలయందర్శించిన మోదీ పవర్ ఫుల్ స్పీచ్ | PM Narendra Modi Prambanan Temple Visit