సుల్తాన్ పూర్ పార్లమెంట్ స్థానం నుండి టిక్కెట్టు దక్కడంపై మేనకాగాంధీ స్పందించారు. వరుణ్ గాంధీకి బీజేపీ టిక్కెట్టు దక్కని విషయమై మాట్లాడేందుకు నిరాకరించారు.
న్యూఢిల్లీ: సుల్తాన్ పూర్ పార్లమెంట్ స్థానం నుండి మరోసారి తనకు టిక్కెట్టు కేటాయించింనందుకు మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ బీజేపీ అగ్రనేతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఫిలిబిత్ పార్లమెంట్ స్థానం నుండి మేనకా గాంధీ కొడుకు వరుణ్ గాంధీకి బీజేపీ నాయకత్వం ఫిలిబిత్ నుండి టిక్కెట్టు కేటాయించలేదు.
సుల్తాన్ పూర్ నుండి మరోసారి తనను అభ్యర్ధిగా పార్టీ నామినేట్ చేసినందుకు తాను సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పారు. వరుణ్ గాంధీ భవిష్యత్తు ప్రణాళికల గురించి మీడియా ప్రశ్నిస్తే అతడినే ప్రశ్నించాలని మేనకాగాందీ మీడియాకు సూచించారు.
వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతుంది. ఈ విషయమై వ్యాఖ్యానించడానికి మేనకాగాంధీ నిరాకరించారు. బీజేపీని వదిలిన వెంటనే స్వాగతం అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీలో వరుణ్ గాంధీ చేరితే సంతోషిస్తామన్నారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరాలని కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పారు.లోక్ సభ ఎన్నికల్లో సుల్తాన్ పూర్ నుండి తనను మరోసారి అభ్యర్ధిగా బరిలోకి దింపిన బీజేపీ నాయకత్వంతో పాటు పార్టీ నేతలకు, ప్రజా ప్రతినిధులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
రాయబరేలీ లేదా ఆమేథీ నుండి వరుణ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా దింపుతుందా అని ప్రశ్నిస్తే తాను బీజేపీలో ఉన్నానని మేనకా గాంధీ చెప్పారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం ఇస్తారని మేనకా గాంధీ తెలిపారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. Have your say! 📢https://telugu.asianetnews.com/mood-of-andhra-survey