నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌ రజనీ

Published : Jan 25, 2021, 08:13 PM ISTUpdated : Jan 25, 2021, 08:17 PM IST
నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌ రజనీ

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాను నటిస్తున్న సినిమా అప్‌డేట్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది.

రాజకీయాల్లోకి వస్తానని అభిమానులను ఊరించి చివరికి నిరాశ పర్చిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తాను నటిస్తున్న సినిమా అప్‌డేట్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శివ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. సన్‌ పిక్చర్స్ నిర్మిస్తుంది. కళానిధి మారన్‌ నిర్మాత. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్‌, నయనతార, ఖుష్బు, మీనా కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్‌ 4న దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు తెలిపింది యూనిట్‌. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల కరోనా కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో చిత్ర బృందంలో కొంత మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో వెంటనే షూటింగ్‌ని నిలిపివేశారు. ఆ వెంటనే రజనీ అనారోగ్యానికి గురయ్యారు. బీపీ పెరగడంతో రెండు రోజుల పాటు ఆందోళన నెలకొంది. 

ఈ ఉత్కంఠభరిత సంఘటన అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికెళ్లిన రజనీ తాను రాజకీయాల్లోకి రావాలనుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు, ఇక తాను రాజకీయాల్లోకి రాలేనని ప్రకటించారు. నటుడిగానే సేవ చేస్తానని చెప్పారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా తన సినిమా నుంచి గుడ్‌ చెప్పి ఊరటనిచ్చారు. ఇదిలా ఉంటే దీపావళికి రజనీ సినిమా వచ్చి 26ఏళ్లు అవుతుందట. `ముత్తు` సినిమా తర్వాత ఈ సారి వస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..