యాక్షన్‌ తోనే రంగంలోకి దిగిన పవన్‌ కళ్యాణ్‌.. ఒకేసారి రెండు

Published : Jan 25, 2021, 03:40 PM IST
యాక్షన్‌ తోనే రంగంలోకి దిగిన పవన్‌ కళ్యాణ్‌.. ఒకేసారి రెండు

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌, రానా హీరోలుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న నూతన చిత్రం రెగ్యూలర్‌ షూటింగ్‌ సోమవారం నుంచి ప్రారంభించారు. షూట్‌లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటుండగా, ఆయనపై యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్‌ కె చంద్ర. ఇందులో రానా దగ్గుబాటి కూడా పాల్గొంటున్నారు. 

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇటీవలే `వకీల్‌ సాబ్‌` షూటింగ్‌ని పూర్తి చేసుకున్నారు. ఆ మధ్యనే `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ని ప్రారంభించారు. సాగర్‌ కె చంద్ర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి స్క్రీన్‌ప్లే, డైలాగులు త్రివిక్రమ్‌ అందిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ సోమవారం నుంచి ప్రారంభించారు. 

ఇందులో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటుండగా, ఆయనపై యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు సాగర్‌ కె చంద్ర. ఇందులో రానా దగ్గుబాటి కూడా పాల్గొంటున్నారు. పది రోజలపాటు హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుపనున్నట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. ఫైట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందని చెప్పారు. ఇదిలా ఉంటే ఇందులో ఐశ్వర్యా రాజేష్‌, సాయిపల్లవిలను హీరోయిన్లుగా అనుకుంటున్నట్టు టాక్‌.

ప్రముఖ నటులుసముద్ర ఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ, నర్రా శ్రీను ఈ చిత్రానికి ఇప్పటివరకు ఎంపికైన తారాగణం కాగా ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ళ కెమెరామెన్‌గా, నవీన్‌ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఏ.ఎస్‌. ప్రకాష్‌ ఆర్ట్ డైరెక్టర్‌.   ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు త్వరలో తెలియజేస్తామని యూనిట్‌ చెప్పింది. ఈ చిత్రానికి సమర్పకులు గా పి.డి.వి. ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల క్రిష్‌ చిత్రం కూడా ప్రారంభమైంది. ఏక కాలంలో క్రిష్‌ సినిమా షూటింగ్‌లో, అలాగే సాగర్‌ చంద్ర చిత్రంలో పవన్‌ పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..