యాంకర్‌ ప్రదీప్‌, పూర్ణ మధ్య లవ్‌ ఎఫైర్‌.. నెట్టింట్లో రచ్చ

By Aithagoni Raju  |  First Published Sep 3, 2020, 6:15 PM IST

ఇప్పటి వరకు టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్‌-రష్మీ, రవి-లాస్య మధ్య, రవి-శ్రీముఖి మధ్య ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా మరో కొత్త జోడీ తెరపైకి వచ్చింది. యాంకర్‌ ప్రదీప్‌, నటి, ఢీ ఛాంపియన్‌ హోస్ట్ పూర్ణ మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 


బుల్లితెరపై యాంకర్‌, కంటిస్టెంట్స్ మధ్య లవ్‌ స్టోరీలు చాలా వినిపిస్తున్నాయి. జబర్దస్త్, ఢీ షోస్‌లో ఎక్కువగా ఇలాంటి క్రష్‌కి సంబంధించిన వార్తలు బయటకు వస్తుంటాయి. గత కొంత కాలంగా జబర్ధస్త్ నుంచి నటుడు సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ రష్మీ మధ్య ఏదో ఉందనే టాక్‌ కోడై కూస్తోంది. జబర్దస్త్ క్లిక్‌ కావడంలో ఈ క్రష్‌లు కీలక భూమిక పోషించాయనే వార్త కూడా వచ్చింది.  

ఇప్పటి వరకు టీవీ షోస్‌లో సుడిగాలి సుధీర్‌-రష్మీ, రవి-లాస్య మధ్య, రవి-శ్రీముఖి మధ్య ఎఫైర్స్ ఉన్నట్టు వార్తలు వినిపించాయి. అప్పట్లో ఇవి పెద్ద దుమారాన్నే రేపాయి. తాజాగా మరో కొత్త జోడీ తెరపైకి వచ్చింది. యాంకర్‌ ప్రదీప్‌, నటి, ఢీ ఛాంపియన్ హోస్ట్ పూర్ణ మధ్య ఏదో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. 

Latest Videos

undefined

దానికి బలం చేకూరేలాగా తాజాగా ఢీ ఛాంపియన్‌ లేటెస్ట్ ప్రోమోని విడుదల చేశారు. ఇందులో ఒక కంటిస్టెంట్‌ డాన్స్ చేయగా అందరూ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా కంటిస్టెంట్‌ని పొగిడే క్రమంలో పూర్ణ .. ప్రదీప్‌తో నాకు క్రష్‌ ఉంది.. క్రష్‌ ఉంటే ఎలా డాన్స్ చేస్తామో చూడండి అని స్టేజ్‌పైకి వచ్చి మరీ ప్రదీప్‌తో కలిసి డాన్స్ చేసింది. ఒకానొక దశలో ఇద్దరు రెచ్చిపోయి డాన్స్ చేశారు.

Dhee Champions Latest Promo.Telecast on 9th September 2020 in ETV Telugu at 9:30 PM https://t.co/0dfmdm69eY

— Mallemalatv (@mallemalatv)

 దీంతో అక్కడున్న వారంతా షాక్‌కి, ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు ఈ క్రమంలో వీరి మధ్య జరిగిన సన్నివేశం నిజంగానే ప్రదీప్‌, పూర్ణల మధ్య ఏదో ఉందనే వార్తని నిజం చేకూర్చేలా ఉంది. ఈ ఢీ షో ప్రోమోని మల్లెమాల సంస్థ పంచుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ షో సెప్టెంబర్‌ 9 నుంచి ప్రసారం కానుంది. మరోవైపు శేఖర్‌ మాస్టర్, ప్రియమణి మధ్య కూడా ఇంకేదో ఉందనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

click me!