చిరంజీవి `మన శంకరవరప్రసాద్‌ గారు` గ్లింప్స్ రివ్యూ.. ఫ్యాన్స్ కి అసలైన మెగా ట్రీట్‌, కాకపోతే అదే మైనస్‌

Published : Aug 22, 2025, 12:50 PM IST
chiranjeevi, Mana ShankaraVaraprasad Garu

సారాంశం

మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి టైటిల్‌ని కన్ఫమ్‌ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్‌ గ్లింప్స్ విడుదల చేశారు. 

DID YOU KNOW ?
చిరంజీవితో మొదటిసారి
చిరంజీవితో దర్శకుడు అనిల్‌ రావిపూడి మొదటిసారి కలిసి పనిచేస్తున్నారు. ఇందులో వింటేజ్‌ చిరంజీవిని చూపించబోతున్నారట అనిల్‌.

మెగాస్టార్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా రూపొందుతున్న `విశ్వంభర` పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. మరోవైపు అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `మెగా157`పేరుతో రూపొందుతున్న మరో మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ని కన్ఫమ్‌ చేశారు. `మన శంకరవరప్రసాద్‌గారు` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. `పండక్కి వస్తున్నారు` అనేది ట్యాగ్‌లైన్‌. మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్ ని విడుదల చేశారు. మెగాస్టార్‌ స్టయిల్‌, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మేళవింపుతో ఈ గ్లింప్స్ ఉండటం విశేషం.

ఇందులో బ్లాక్‌ సూట్‌ బూట్‌ వేసుకుని బ్లాక్‌ కారులో నుంచి దిగుతూ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సిగరేట్‌ తాగుతూ, తన స్టయిల్‌లో కళ్లజోడు పెట్టుకుని కారులో నుంచి స్టయిల్‌గా, మాస్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన బాడీగార్డ్స్‌ తో కలిసి సీరియస్‌ గా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ వాక్‌లో చిరు మార్క్ మ్యానరిజం, స్టయిల్‌ కనిపిస్తుంది. వింటేజ్‌ చిరంజీవిని చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఓ ఇంట్లో మెట్లమీద నుంచి మాస్‌గా దిగుతూ వస్తున్నారు. చేతిలో గన్‌ ఉంది. యాక్షన్‌ ఇరగదీశాడని దీని బట్టి అర్థమవుతుంది. చివర్లో గుర్రాన్ని పట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్ అదిరిపోయింది.

అయితే ఇందులో చిరంజీవి మార్క్ పాత సినిమాలను గుర్తు చేస్తూ, తన పాత్రల లుక్‌ని చూపిస్తూ ఈ గ్లింప్స్ సాగింది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో వింటేజ్‌ చిరంజీవిని చూడబోతున్నామని ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో టైటిల్‌ కూడా విభిన్నంగా ఉంది. ఏదో మాస్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా `మన శంకరవరప్రసాద్‌ గారు` అంటూ చిరంజీవి అసలు పేరుని టైటిల్‌గా పెట్టడం విశేషం. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్‌ అనే విషయం తెలిసిందే.

ఇక ఇందులో చిరంజీవి ఒక ప్రభుత్వ అధికారిగా కనిపించబోతున్నారని ఈ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే హడావుడి చూస్తుంటే నిజంగానే చిరు అలాంటి పాత్రలో కనిపిస్తున్నారా? లేక సినిమాలో ఏదైనా డ్రామాలో భాగమా? అనే డౌట్‌ కూడా వస్తుంది. ఏదేమైనా మాస్‌ ఆడియెన్స్ కి మంచి ట్రీట్‌ లా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ఇందులో మెగాస్టార్‌ మార్క్ ఎలాంటి డైలాగ్‌లు లేకపోవడం చిరు ఫ్యాన్స్ ని డిజప్పాయింట్‌ చేస్తోంది. ఇది గ్లింప్సే కావడంతో మున్ముందు ఇంకా చాలా ఉంటుందని చెప్పొచ్చు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. షైన్‌ స్క్రీన్‌, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహుగారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చిరు పెద్ద కూతురు సుస్మిత ఒక నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. అందుకే ట్యాగ్‌ లైన్‌ని `పండక్కి వస్తున్నారు` అని పెట్టారు. అనిల్‌ రావిపూడి చివరగా వెంకటేష్‌తో `సంక్రాంతికి వస్తున్నాం` మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇది పెద్ద హిట్‌ అయ్యింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..