రీల్‌ స్టార్‌ రియల్‌ లైఫ్‌.. `లేడీ`తో మాధవిలత రీఎంట్రీ

Published : Aug 16, 2020, 01:24 PM IST
రీల్‌ స్టార్‌ రియల్‌ లైఫ్‌.. `లేడీ`తో మాధవిలత రీఎంట్రీ

సారాంశం

మాధవిలత రాజకీయాలకు సంబంధించి, సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఓ ఘాటైన, సుధీర్ఘమైన పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. తాను ఎవరికీ బయపడనని, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తన వద్ద పిచ్చి పిచ్చి వేశాలు వేయొద్దని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది.

మాధవిలత.. తెలుగులో `నచ్చావులే`, `స్నేహితుడా`, `మిథునం`,`అరవింద్‌ 2` చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌. నటిగా తనకు వచ్చిన అవకాశాలే తక్కువ. అందులో సక్సెస్‌ శాతం చాలా తక్కువ. దీంతో సినిమాలకు గుడ్‌బైన్‌ చెప్పింది. బీజేపీ పార్టీలో చేరి ప్రజలకు సేవ చేస్తానని తెలిపింది. ఐదేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. 

ఇక ఇటీవల రాజకీయాలకు సంబంధించి, సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఓ ఘాటైన, సుధీర్ఘమైన పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించింది. తాను ఎవరికీ బయపడనని, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తన వద్ద పిచ్చి పిచ్చి వేశాలు వేయొద్దని గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా మాధవిలత హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. 

ఇప్పుడు సినిమాలకు రీఎంట్రీ ఇస్తూ మరోసారి హైలైట్‌ అయ్యింది. తాజాగా ఆమె మోనో యాక్టింగ్‌తో సినిమా చేయబోతుంది. థ్రిల్లింగ్‌ ఎమోషనల్‌ డ్రామ్‌గా రూపొందుతున్న `లేడీ` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె సోలో పర్‌ఫార్మెన్స్ ఇవ్వబోతుంది. మోనో యాక్టింగ్‌తో మెరవనుందట. రీల్‌ స్టార్‌కి చెందిన రియల్‌ స్టోరీతో ఇది రూపొందుతుందని చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. జీఎస్‌ఎస్‌పి కళ్యాణ్‌ దీనికి దర్శకత్వం వహిస్తూ, సత్యానారయణ జీతో కలిసి నిర్మిస్తున్నారు. 

తాజాగా ఓ ఫోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో `సూసైడింగ్‌ సూన్‌` అని ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి రీఎంట్రీ తర్వాతనైనా మాధవిలత హీరోయిన్‌గా గుర్తింపు పొందుతుందేమో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..