విక్రమ్ 'మిస్ట‌ర్ కేకే' మూవీ రివ్యూ

By tirumala ANFirst Published Jul 19, 2019, 5:36 PM IST
Highlights

విక్రమ్ హీరోగా నటించిన మిస్టర్ కేకే చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ నుంచి వస్తున్న మరో డిఫెరెంట్ మూవీ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో నెలకొని ఉంది. 

---(Review By సూర్య ప్రకాష్ జోశ్యుల)

ప్రెంచ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన  Point Blank (2010) అనే క్రైమ్ థ్రిల్లర్ ని  అఫీషియల్ రైట్స్ తీసుకుని రీమేక్ చేయాలనే కమల్ ఆలోచన గొప్పదే. మెయిన్ పాయింట్ లేపేసి మనం కథ అల్లేసుకోవచ్చు కదా అని ఆలోచన రాకపోవటం అద్బుతమే.  ఈ సినిమాకు విక్రమ్ ని హీరో గా ఎంచుకుంటే క్రేజ్ వస్తుందని, తన ఆస్దాన దర్శకుడు  రాజేష్ ఎం సెల్వ (ఇంతకు ముందు కమల్ తో  చీకటి రాజ్యం తీసిన దర్శకుడు..అదీ ప్రెంచ్ రీమేకే) అయితే ఏ ఇబ్బంది ఉండదనుకోవటం వరకూ హ్యాపీనే. అయితే అక్కడ కథ ఇక్కడ వర్కవుట్ అవుతుందా..అక్కడ చిన్న థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ..విక్రమ్ వంటి పెద్ద స్టార్ తో చేయదగ్గదేనా అని ఆలోచించే చేసారా...అసలు కథేంటి, ఒరిజనల్ కు మన ఇండియన్ వెర్షన్ కు చేసిన మార్పులు ఏమిటి,మనవాళ్లు ఈ కేకేని ఓకే అని ఆదరిస్తారా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి:
మలేషియా ఓ ప్రెవేట్ హాస్పటిల్ లో డాక్టర్ గా పనిచేసే వాసు (అభి హాసన్) తన భార్య  అథిరా (అక్షర హాసన్)తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. ఆమె గర్బవతి. ఈ లోగా  ఓ రోజు తీవ్రంగా గాయపడ్డ గ్యాంగస్టర్   మిస్టర్ కేకే (విక్రమ్) ని పోలీస్ లు ఆ హాస్పటిల్ కు తీసుకు వస్తాడు. వాసు అతనికి ట్రీట్మెంట్ చేసి  కాపాడతాడు.  అయితే ఊహించని విధంగా ఈ లోగా  వాసు భార్య  కిడ్నాప్ అవుతుంది. కేకేని విడిచిపెడితేనే నీ భార్యను క్షేమంగా వదులుతామని కండీషన్ పెడతారు. అలాంటి విపత్కర పరిస్దితుల్లో   వాసు ఏం చేస్తాడు..అసలు కేకే కథేంటి..అతన్ని గాయపరిచింది ఎవరు.. తన భార్య అథిరాని కిడ్నాపర్స్  ఎలా రక్షించుకున్నాడు అనేది తెరపై చూడాల్సిన మిగతా కథాంశం.

హీరో విక్రమ్ కాదా ...

పైన కథ చదివితే ఓ విషయం అర్దమవుతుంది. వాసు అనే డాక్టర్..ఓ గ్యాంగస్టర్ కు ట్రీట్మెంట్ చేయటం వల్ల ఇరుకులో పడ్డాడు. అతను ఆ సమస్యలోంచి ఎలా బయిటపడతాడు అన్నదే కథ అనిపిస్తుంది. విక్రమ్ ఆ కథలో ఓ భాగం అని అర్దమవుతుంది. తెరమీదా అదే జరిగింది అదే. విక్రమ్ కేవలం కథలో ఓ భాగమే. అంతేతప్ప ఇది విక్రమ్ కథలా అనిపించదు. ఆ విషయం ఫస్టాఫ్ లో దర్శకుడు కూడా గమనించలేదు. ఇంటర్వెల్ దాకా విక్రమ్ ని పెద్దగా పట్టించుకోడు. విక్రమ్  యాక్షన్ లోకి దింపటానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఫ్రెంచ్ వెర్షన్ లో ఉన్నట్లుగా ఇక్కడా చేద్దామనుకున్నారు.

చాలా సీన్ లలో  అభి హాసన్ చుట్టూ కథ నడుస్తూ..అతని డామినేషన్ ఉంటుంది. అతనే సమస్యలో పడటం ఉంటుంది. విక్రమ్ డమ్మీగా కనపడతాడు.  అంతేకాని విక్రమ్ సినిమా చూద్దామని జనం వస్తారు. అతన్ని త్వరగా కథలోకి లాగి, విషయం చెప్పి యాక్షన్ లోకి తోసేద్దామనుకోలేదు.  కథల్లో థ్రిల్లింగ్ గా అనిపించే విషయాలు మనం అంతకు ముందు సినిమాల్లో చూసినవే. కాబట్టి మనం ఎక్సపెక్ట్ చేసేయగలం. 

ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే...ప్రెంచ్ సినిమాని ఇక్కడ నేటివిటి కు ఎడాప్ట్ చేసే క్రమంలో ..ఫస్టాఫ్ లో అంతా దాచి పెట్టి  సెకండాఫ్ లో ఒక్కసారిగా రివీల్ చేసారు. దాంతో సెకండాఫ్ పెద్ద భారం మోస్తున్నట్లుంది. ఫస్టాఫ్ ఏమీ జరగలేదు..కాలక్షేపంగా నడిచిపోయినట్లుంది. విక్రమ్ ని హీరో అనే విషయం దర్శకుడు మర్చిపోయాడు.

యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయంటే..
సినిమా పోస్టర్స్, టీజర్స్ చూడగానే విక్రమ్ ఓ రేంజిలో యాక్షన్ సీక్వెన్స్ లు చేసి ఇరగ్గొట్టేసిన సినిమా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో అంత సీన్ లేదు. అంతా ఛేజింగ్ లతోనే స్క్రీన్ టైమ్ నిండిపోతుంది. అక్కడక్కడా వచ్చే చిన్న యాక్షన్ బిట్స్ ...జస్ట్ ఓకే అన్నట్లుంటాయి. ఏ మాత్రం థ్రిల్లింగ్ గా అనిపించవు. 

టెక్నికల్ గా: 
సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్, ప్లస్ జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్,విజువల్ గా తేలిపోయిన సీన్స్  కు కూడా  ప్రాణం పోసాడు. అలాగే సెకండ్ హాఫ్ లో విక్రమ్ క్యారక్టర్ ని  ఎలివేట్ చేస్తూ వచ్చే సాంగ్ కూడా బాగుంది. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాల రిచ్ గా ఉన్నాయి.ఎడిటింగ్ కూడా ఫెరఫెక్ట్ గా ఉంది. ఫోటోగ్రఫి కూడా రిచ్ గా  ఉండి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ చాలా సార్లు తీసుకు వచ్చింది. 

ఓవరాల్ గా

మిస్టర్ కేకే ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పటంలో మొహమాటం లేదు. అయితే థ్రిల్లర్ అన్నప్పుడు ఆ థ్రిల్స్ మనం వెతుక్కుని మరీ థ్రిల్ ఫీలయ్యేలా ఉండకూడదు. అపరిచితుడు, శివపుత్రుడు వంటి అనేక సినిమాలు చేసిన విక్రమ్ నుంచి అయితే ఈ సినిమా ఎక్సపెక్ట్ చేయద్దు..విక్రమ్ లేడు అనుకుని ఓ థ్రిల్లర్ లా సినిమా చూస్తే బాగుందనిపిస్తుంది. 
 
ఫైనల్ థాట్:
అసలు ఈ సినిమా కమల్ కు ఎలా నచ్చింది..విక్రమ్ ఎలా ఒప్పుకున్నాడనేది పెద్ద మిస్టరీ. 

Rating: 1.5

click me!
Last Updated Jul 19, 2019, 5:36 PM IST
click me!