కామెడీ చిత్రం 'దోచేవారెవరురా'ఎలా ఉంది? చూడచ్చా ? (మినీ రివ్యూ)

By Surya Prakash  |  First Published Mar 13, 2023, 4:52 PM IST

చిన్న ఆర్టిస్టులతోనే బ్లాక్ బస్టర్స్ సాధించవచ్చని నిరూపించిన దర్శకులు శివ నాగేశ్వరరావు గారు మళ్ళీ మెగా ఫోన్ చేపట్టి తీసిన  సినిమా దోచేవారెవరురా. 


కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు ఉన్న సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు డైరక్షన్ లో రూపొందిన చిత్రం "దోచేవారెవరురా.."..  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11న గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్ కామెడీలు కరువు అవుతున్న ఈ సమయంలో ఈ ఫన్నీ ఫిల్మ్ చూసిన వారందరినీ మొహమాటం లేకుండా ఎంటర్టైన్ చేస్తోంది.  కొన్ని సీన్స్ పగలబడి నవ్వుకునేలా ఉంటే మరికొన్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తున్నాయి. అయితే ఆర్.ఆర్. ఆర్ ఫీవర్ లో ఉన్న మీడియా ఈ సినిమాపై దృష్టి లేదనే  చెప్పాలి. ఇక ఈ చిత్రం రెగ్యులర్ గా కాకుండా శనివారం రిలీజ్ అవటం..అతి తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవటం, పబ్లిసిటీ పెద్దగా లేకపోవటంతో జనాలకు ఈ సినిమా రిలీజ్ అయ్యిందనే విషయం  తెలియలేదు. అయితే చూసిన వాళ్లు బాగుందనటంతో మౌత్ టాక్ మెల్లిగా స్ప్రెడ్ అవుతోంది. అసలు ఈ సినిమా కథేంటి., సినిమా ఎలా ఉందో చూద్దాం.

చిత్రం స్టోరీ లైన్ గమ్మత్తుగా ఉంది.  దొంగతనాలు కలిసి చేస్తూంటారు సిద్దు సీనియర్ (ప్రణవ చంద్ర) ,సిద్దు జూనియర్ (చైల్డ్ ఆర్టిస్ చక్రి). వాళ్లకు ఎవరి స్దాయికి తగ్గట్లు వాళ్లకు  అవసరాలు,త ఫ్లాష్ బ్యాక్ లు ఉంటాయి.   లక్కీ (మాళవిక సతీషన్) ఓ సాప్ట్ వేర్ అమ్మాయి. ఆమె తన నగ దొంగతనం చేస్తున్నప్పుడు వీళ్లను పట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్లు స్నేహితులు అవుతారు.  

Latest Videos

undefined

ఇదిలా ఉంటే లక్కీ బాస్ ఆమెను సెక్సువల్  ఫేవర్స్ అడుగుతూంటాడు.  ఒప్పుకోకపోవటంతో ఆమె స్నానం చేస్తున్న వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. ఆ క్రమంలో తనకు పరిచయమైన ఇద్దరి దొంగల సాయిం తీసుకుని అతని సెల్ ఫోన్ కొట్టేసే ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ విజయవంతమైందని ఆనందపడేలోగా ...ఆ బాస్ వాళ్లింట్లో చచ్చి పడుంటాడు. దాంతో పోలీస్ లకు ఈ దొంగలమీదే అనుమానం వస్తుందని భయపడుతూంటారు.

మరోప్రక్క గోవాలో ఉండే బిజినెస్ మ్యాన్  విమల్ (అజయ్ ఘోష్)  హైదరాబాద్ లో ఉండే ఓ ఫ్రొఫిషనల్ కిల్లర్ పీకే సత్తి (బిత్తిరి సత్తి)ని ఎప్రోచ్ అవుతాడు.  తన భార్య పార్వతి (ప్రణవి సాధనాల) ని మర్డర్ చేయమని సుపారి ఇస్తాడు . ఈ లోగా ఆ దొంగలు ఇద్దరూ పోలీస్ ల నుంచి తప్పించుకోవటానికి  గోవా పారిపోయి వస్తారు. వాళ్ల లొకేషన్ ని ట్రేస్ చేస్తూ పోలీస్ లు అక్కడికి వస్తారు.  అక్కడ నుంచి కథ మరో టర్న్ తీసుకుంటుంది. ఈ క్రమంలో సిద్దు సీనియర్, జూనియర్ లు ఎలా తప్పించుకున్నారు. చనిపోయిన బాస్ కథ ఏమైంది...అసలు విమల్ తన భార్య పార్వతిని ఎందుకోసం మర్డర్ చేయించాలనుకుంటాడు, మధ్యలో కిల్లర్ సత్తి కి దొంగ సిద్దు కి ఉన్న సంబంధం ఏమిటి,  వంటి విషయాలు తెలియాలంటే  దోచేవారెవరురా మూవీ చూడాల్సిందే.
 
 దర్శకుడు శివనాగేశ్వరరావు ‘వన్‌ బై టూ, లక్కీ ఛాన్స్‌, మనీ మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం, వామ్మో వాత్తో ఓ పెళ్ళామా, ఓపనై పోతుంది బాబు, హ్యాండ్సప్‌’ లాంటి వరుస వైవిధ్య హాస్య కథలతో జనాన్ని అలరించారు. తరువాత ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి, ఫోటో, భూకైలాస్‌’ బాగున్నాయనిపిం చాయి. తాజాగా మరోసారి ఆయన   "దోచేవారెవరురా.." నవ్వించటానికి రెడీ అయ్యారు సొసైటిలో అందరూ అందరిని  రకరకాలుగా దోచుకుంటున్నారు.ఇంతకుముందు ఎవర్ని  దోచుకోవాలో  సెలెక్ట్ చేసుకొని వారిని దోచుకొనే వారు. ప్రస్తుతం మనల్ని ఎవరు దోచుకోవాలో వారిని మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాము అనే విషయం ఫన్నీ గా చెప్పే ప్రయత్నం చేసారు. ఆయన తరహా కామెడీ నచ్చేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

నటీనటుల్లో అజయ్ ఘోష్ విలన్ గా, సపోర్టింగ్ నటుగా కీ రోల్స్ లో ద్విపాత్రాభినయం చేసారు. ఆయన చుట్టూ నే ఎక్కువ శాతం కథ తిరుగుతుంది. ప్రముఖ పాటల రచయిత కుమారుడు ప్రణవ్ చంద్ర కొత్తవాడైనా చక్కగా చేసారు. హీరోయిన్ గా మాళవిక  సతీషన్ నీట్ గా తన పాత్రను చేసుకుంటూ వెళ్లింది. వాళ్ల పెయిర్ బాగుంది. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి మంచి స్దాయికు వెళ్తాడనిపించింది.డైలాగు డెలవరీ,కామెడీ టైమింగ్ చక్కగా ఉంది.  టెక్నికల్ గా చూస్తే శివనాగేశ్వరరావు కామెడీ టైమింగ్ ఇప్పటికి ప్రెష్ గానే ఉంది. చిన్న సినిమా కాబట్టి అంతకు తగ్గట్లే టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి. కామెడీ సినిమాకు తగ్గ మేకింగ్ ఉంది. ఖల్లాసు అన్నీ వర్రీసు అంటూ సాగే పాట బాగుంది.

చూడచ్చా

ఓ కామెడీ సినిమాగా ఈ సినిమా నవ్విస్తుంది. అంతకు మించి ఎక్సపెక్ట్ చేస్తేనే ఇబ్బంది పెడుతుంది. 


బ్యానర్ : IQ క్రియేషన్స్
నటీనటులు: ప్రణవ చంద్ర, మాళవిక సతీశన్ అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి, టార్జాన్, ప్రణతి  తదితరులు
 డిఓపి : అర్లి
సంగీతం : రోహిత్ వర్ధన్
ఎడిటింగ్  : శివ వై ప్రసాద్ , 
సంగీతం  :రోహిత్ వర్ధన్ – కార్తిక్ , 
సాహిత్యం  :చైతన్య ప్రసాద్ – సిరాశ్రీ-శివనాగేశ్వరరావు 
నృత్యాలు  :  శంకర్ -శ్యామ్
ఆర్ట్ డైరెక్షన్  : వెంకట్- రాజశేఖర్  
నిర్మాత : బొడ్డు కోటేశ్వర రావు
దర్శకుడు : శివనాగేశ్వర రావు
విడుదల తేదీ : మార్చి 11, 2023
 
  

click me!