తన ఓటు బీజేపీకి పడిందని... వేలు నరుక్కున్నాడు

Published : Apr 19, 2019, 07:45 AM IST
తన ఓటు బీజేపీకి పడిందని... వేలు నరుక్కున్నాడు

సారాంశం

తన ఓటు  పొరపాటున బీఎస్పీకి పడాల్సింది పోయి బీజేపీకి పడిందని ఓ ఓటరు ఏకంగా తన వేలు నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలోని షికార్ పూర్ పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది.  

తన ఓటు  పొరపాటున బీఎస్పీకి పడాల్సింది పోయి బీజేపీకి పడిందని ఓ ఓటరు ఏకంగా తన వేలు నరికేసుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ నగరంలోని షికార్ పూర్ పోలింగ్ కేంద్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గురువారం రెండో విడుత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. యూపీలోని బులంద్ షహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ బీజేపీ ఎంపీ అయిన భోలాసింగ్ పై ఎస్పీ-బీఎస్పీ,ఆర్ఎల్డీ ఉమ్మడి అభ్యర్థిగా యోగేష్ వర్మ ఎన్నికల బరిలో నిలిచారు. గురువారం పోలింగ్ జరిగిన ఈ నియోజకవర్గంలోని షికార్ పూర్ పోలింగ్ కేంద్రానికి అబ్దుల్లాపూర్ హులసాన్ గ్రామానికి చెందిన బీఎస్పీ మద్ధతుదారైన పవన్ కుమార్ (25) ఓటేసేందుకు వచ్చారు.

 పవన్ కుమార్ బీఎస్పీకి ఓటేయబోయి పొరపాటున బీజేపీకి వేశారు. అనంతరం తన పొరపాటును గ్రహించిన పవన్ కుమార్ ఆవేదన చెందారు. పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి తిరిగివచ్చిన పవన్ కుమార్ ఇలాంటి తప్పు మరోసారి చేయకుండా ఉండేలా తన వేలిని తానే కత్తితో నరుక్కున్నాడు. వేలు నరుక్కున్న ఘటనను వీడియో తీసిన పవన్ కుమార్ దాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు