రెండు సీట్లలో రాహుల్ పోటీ: బీజేపీ సెటైర్లు, ఓడిస్తామన్న విజయన్

Published : Mar 31, 2019, 12:14 PM IST
రెండు సీట్లలో రాహుల్ పోటీ: బీజేపీ సెటైర్లు, ఓడిస్తామన్న విజయన్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రెండు ఎంపీ స్థానాల నుండి పోటీ చేయనున్నారు.  యూపీలోని ఆమేథీ నుండి పోటీ చేస్తున్నారు. కేరళలోని వయనాడ్‌ నుండి పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ రెండు ఎంపీ స్థానాల నుండి పోటీ చేయనున్నారు.  యూపీలోని ఆమేథీ నుండి పోటీ చేస్తున్నారు. కేరళలోని వయనాడ్‌ నుండి పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఓటమి భయంతోనే రాహుల్ కేరళ నుండి  రెండో సీటు నుండి పోటీ చేస్తున్నారని బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇప్పటికే కాంగ్రెస్  పార్టీ యూపీలోని ఆమేథీ నుండి రాహుల్ పోటీకి దిగారు. దక్షిణాది నుండి కాంగ్రెస్ పార్టీలో ఉత్తేజం నింపాలనే ఉద్దేశ్యంతో  రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌ నుండి పోటీకి సిద్దమయ్యారు.

ఓటమి భయంతోనే కేరళ రాష్ట్రంలోని రెండో సీటు నుండి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది.లెఫ్ట్‌కు వ్యతిరేకంగా కేరళలో పోటీ చేయాలని రాహుల్  నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని కేరళ సీఎం విజయన్ అభిప్రాయపడ్డారు. 

బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాలని ఆయన కోరారు.  వయనాడ్‌లో రాహుల్‌ను ఓడిస్తామని విజయన్ ప్రకటించారు.తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుండి పోటీ చేయాలని  రాహుల్‌ను కోరడంతో  ఆయన చివరకు కేరళను ఎంచుకొన్నారని ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి.

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు