సీఎం అడ్డదారులు తొక్కుతున్నారు.. సుమలత కామెంట్స్

Published : Mar 30, 2019, 10:13 AM IST
సీఎం అడ్డదారులు తొక్కుతున్నారు.. సుమలత కామెంట్స్

సారాంశం

తమ కుమారుడిని గెలిపించేందుకు సీఎం కుమారస్వామి అడ్డదారులు తొక్కుతున్నారని సినీ నటి సుమలత ఆరోపించారు. 

తమ కుమారుడిని గెలిపించేందుకు సీఎం కుమారస్వామి అడ్డదారులు తొక్కుతున్నారని సినీ నటి సుమలత ఆరోపించారు. మాండ్య నియోజకవర్గం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తులో భాగంగా అదే నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్నారు.

అయితే.. ఆ నియోజకవర్గంలో కొడుకును గెలిపించేందుకు కుమారస్వామి అడ్డదారులు తొక్కతున్నారని సుమలత ఆరోపిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని సినీనటి, స్వతం త్ర అభ్యర్థి సుమలత డిమాండ్‌ చేశారు. 

మండ్యలో  ఆమె మీడియాతో మాట్లాడుతూ మండ్యలో జరుగుతున్న ఎన్నికలు ధనబలానికి జనబలానికి మధ్యనే ఉన్నాయన్నారు. తనకు ప్రజల అభిమాన మే శ్రీరామరక్ష అన్నారు. వెళ్ళినచోటల్లా ప్రజలకు తనకు హారతులిచ్చి మరీ స్వాగతం పలుకుతున్నారన్నారు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు వ్యవహరిస్తున్న తీరువల్ల అంబరీశ్‌ ఆత్మ క్షోభిస్తోందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు