మీ వల్లే నా బిడ్డ ఫెయిలైంది: కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేత ఫైర్

Siva Kodati |  
Published : May 09, 2019, 04:05 PM IST
మీ వల్లే నా బిడ్డ ఫెయిలైంది: కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేత ఫైర్

సారాంశం

నేతలకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే పరీక్షల్లో ఫలితాలను ముడిపెట్టి ఇద్దరు  నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శిలకు దిగారు.

నేతలకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి. అయితే పరీక్షల్లో ఫలితాలను ముడిపెట్టి ఇద్దరు  నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శిలకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కర్నాటక రాష్ట్రం కలబుర్గి జిల్లా  చించోళికి చెందిన బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి ఉమేశ్ జాదవ్ వెరైటీ వ్యాఖ్యలు చేశారు.

నా కుమార్తె పీయూసీలో ఫెయిల్ అయ్యేందుకు కాంగ్రెస్ నేతలే కారణమంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి రాజకీయ భవిష్యత్ కోసం వెళ్లానని, అయితే పార్టీ ఫిరాయించినందుకు గాను తాను భారీగా నగదు పొందానని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం సరికాదని జాదవ్ వ్యాఖ్యానించారు.

పరీక్షల్లో తప్పడం వల్ల తన కుమార్తె మానసికంగా ఇబ్బంది పడిందన్నారు. చివరకు పరీక్షలు సక్రమంగా రాయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అవాస్తవాలు ప్రచారం చేసి తన కుమార్తె మానసికంగా ఇబ్బంది పడటానికి కాంగ్రెస్ నేతలే కారకులయ్యారని ఆయన ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై మంత్రి ప్రియాంక ఖర్గే ధీటుగా స్పందించారు. రాజకీయాలకు కుటుంబసభ్యులను వాడుకోవడం సిగ్గు చేటన్నారు.. తన తండ్రిని శ్రీమంత దళితుడనే వ్యాఖ్యలు చేసినప్పుడు తన  కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడలేదా అని ఆమె ప్రశ్నించారు.

ఉమేశ్ జాదవ్  కాంగ్రెస్ పార్టీని వీడేందుకు స్పష్టమైన కారణం లేదన్నారు. మరోవైపు ఉమేశ్ కుమారుడు డాక్టర్ అవినాశ్ జాదవ్... చించోళి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచి ఎండీ పరీక్షల్లో పాల్గొన్నారు.

ఆయన మొత్తం నాలుగు పరీక్షల్లో పాల్గొనాల్సి ఉండగా.. ఎన్నికల ప్రచారానికి మరో తొమ్మిది రోజులు  మాత్రమే గడువు ఉండటంతో అన్నింటినీ రాయలేనన్నారు. తన సోదరిపై కాంగ్రస్ నేతల ఆరోపణల ప్రభావం పడిందని, అందుకే పీయూసీలో ఫెయిల్ అయ్యిందని అవినాశ్ తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు