బెంగాల్‌లో బాబు ప్రచారం: ఢిల్లీలో రాహుల్‌తో భేటీ, కూటమిపై చర్చ

By Siva KodatiFirst Published May 8, 2019, 10:11 AM IST
Highlights

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కోల్‌కతాలో బుధవారం ప్రచారానికి వెళ్లేముందు రాహుల్‌తో బాబు సమావేశమవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కోల్‌కతాలో బుధవారం ప్రచారానికి వెళ్లేముందు రాహుల్‌తో బాబు సమావేశమవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

లోక్‌సభ ఎన్నికలు, వీవీప్యాట్స్‌పై సుప్రీం తీర్పు, తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు అరగంట పాటు చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు మరో రెండు విడతలు మాత్రమే మిగిలి ఉండటంతో కూటమి వ్యవహారాలపై చర్చలు జరిపారు.

అలాగే ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల బలాబలాలు ఎలా ఉండొచ్చు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందన్న దానిపై విశ్లేషించారు. 

click me!