రాజీవ్ గాంధీ 17 వేలమందిని చంపించారు: బీజేపీ ఎంపీ వివాదాస్పద ట్వీట్

By Siva KodatiFirst Published May 17, 2019, 2:03 PM IST
Highlights

సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా గాడ్సే, హిందూ తీవ్రవాది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకోవడంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా గాడ్సే, హిందూ తీవ్రవాది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేగింది.

దీనిపై కొందరు కేసుల వరకు వెళ్లారు. ఏడో విడత ఎన్నికల ప్రచారంలో అవే వ్యాఖ్యలను నేతలు ప్రచార అస్త్రాలుగా చేసుకుని రెచ్చిపోతున్నారు. గాంధీని హత్య చేసిన గాడ్సే దశ భక్తుడని బీజేపీ నేత సాద్వీ ప్రజ్ఞాసింగ్ చెప్పడంతో పెద్ద దుమారం రేగడం, దానికి ఆమె క్షమాపణలు చెప్పడం తెలిసిందే.

తాజాగా మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నళీన్ కుమార్ కాటిల్..

గాడ్సే కేవలం గాంధీని మాత్రమే హత్య చేశాడు.. కసబ్ ముంబైలో విధ్వంసం సృష్టించి 72 మందిని చంపాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 17,000 మందిని హత్య చేశారు.. వీరిలో ఎవరు ప్రజల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారో అర్ధమవుతోంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కుల ఊచకోతలో మూడు రోజుల్లో 3,000 మంది అమాయకులను హత మార్చారని నళీన్ అభిప్రాయపడ్డారు. ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన ట్వీట్టర్ ఖాతా నుంచి తొలగించారు. 

click me!