గతంలో ఒంటరిగానే ఎన్నికల ప్రచారం...కానీ ఇప్పుడు వారున్నారు: జయప్రద

By Arun Kumar PFirst Published Apr 8, 2019, 7:40 PM IST
Highlights

టాలీవుడ్, బాలీవుడ్ లో విజయవంతమైన హీరోయిన్ గా ఓ వెలుగువెలిగిన అలనాటి అందాల తార జ‌య ప్ర‌ద ఇటీవలే బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె చేరిక ద్వారా ఎస్పీ కీలక మైనారిటీ నేత ఆజంఖాన్ ను ఢీకొట్టే గట్టి నాయకురాలు  బిజెపికి లభించింది. ఇలా పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే ఉత్తర ప్రదేశ్ లోని రాంపుర నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా జయ ప్రదకు అవకాశం లభించింది. దీంతో పాత మిత్రులు కాస్తా రాజకీయ ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.

రాంపుర నియోజకవర్గ పరిధిలో మంగళవారం ఎన్నికల ప్రచారంలో జయప్రద పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గతంలో ఎస్పీ అధికారంలో వున్న కాలంలో ఆజంఖాన్ తీవ్ర అవినీతికి పాల్పడి అక్రమంగా భారీ ఆస్తులను కూడబెట్టారని ఆరోపించారు. వాటిని కాపాడుకోడానికే ఇప్పుడు ఆయన మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. 

రాంపూర్ నియోజకవర్గ ప్రజలతో తనకు భావోద్వేగ సంబంధముందని జయప్రద గుర్తుచేసుకున్నారు. 2004, 2009ల్లో రెండుసార్లు తనను ఎంపిగా గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలకు తాను ఎంతో రుణపడి వున్నానని అన్నారు. కేంద్రంలో ఎలాగూ తమ పార్టే అధికారంలోకి వచ్చి మోదీ ప్రధాని అవుతారు కాబట్టి ఈసారి తనను గెలిపిస్తే మీరుణం తీర్చుకుంటానని జయప్రధ హామీ ఇచ్చారు. 

గతంలో తాను ఇతర పార్టీల తరపున పోటీ చేసినపుడు  ప్రచార బాధ్యతలను స్వయంగా పర్యవేక్షించేవాడినని గుర్తుచేసుకున్నారు. కానీ ఇప్పుడు తనకా చింత లేదని...బిజెపి కార్యకర్తలు ఆ పని చేస్తూ తన గెలుపుకోసం కృషి చేస్తున్నారన్నారు. దీంతో తనకు గెలుపుపై మరింత ధీమా పెరిగిందని జయప్రద అన్నారు. 
  
తనపై ప్రత్యర్థి ఆజంఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా ఆమె స్పందించారు. ఆయన కు మహిళలంటే  ఏమాత్రం గౌరవముందో ఈ వ్యాఖ్యలను బట్టే తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంపూర్ నియోజకవర్గ ప్రజలకు ఆయనగురించి, తన గురించి బాగా తెలుసు కాబట్టి విచక్షణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని జయప్రద సూచించారు.

click me!