సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు: ముఖ్యమంత్రి ఫైర్

By Siva KodatiFirst Published Apr 8, 2019, 12:41 PM IST
Highlights

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగంపై వారిపై దాడులు జరుగుతున్నాయి. 

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సన్నిహితుల ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అభియోగంపై వారిపై దాడులు జరుగుతున్నాయి.

ఏప్రిల్ 7వ తేదీ నుంచి సోమవారం ఉదయం వరకు దాడులు కొనసాగాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో సహా 50 ప్రాంతాలలో సోదాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్, ఆర్కే మిగ్లానీ ఇళ్లపై కూడా సోదాలు చేశారు.

ఈ సోదాల్లో దాదాపు 200 మందికి పైగా అధికారులు పాల్గొన్నట్లు సమాచారం. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల నేపథ్యంలో హవాలా మార్గంలో నగదు చేరవేస్తున్నారని, పన్ను ఎగవేత ఆరోపణలు రావడంత సోదాలు నిర్వహించినట్లు ఐటీ అధికారులు తెలిపారు.

మరోవైపు ఆదాయపు పన్ను శాఖ దాడులపై సీఎం కమల్ నాథ్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఐటీ దాడులు చేయిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. 

click me!