బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

Published : Mar 22, 2019, 12:44 PM ISTUpdated : Mar 22, 2019, 12:45 PM IST
బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్

సారాంశం

టీం ఇండిమా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమయంలో గంభీర్ కాషాయం కండువా కప్పుకున్నారు. 

టీం ఇండిమా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బీజేపీలో చేరారు. దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమయంలో గంభీర్ కాషాయం కండువా కప్పుకున్నారు. గంభీర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు గంభీర్ దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. కాగా.. ఈ రోజు ఏకంగా పార్టీలోనే చేరిపోయారు.

కాగా.. పార్టీలో  చేరడమే కాదు.. గంభీర్ ఈ ఎన్నికల బరిలోకి కూడా దిగననున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఏ లోక్ సభ సీటు నుంచి ఆయన పోటీ చేస్తారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ముందు నుంచి గంభీర్ దేశ సమగ్రత విషయంలో సోషల్ మీడియాలో  చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు.

ఇటీవల పుల్వామా ఉగ్రదాడి, అనంతరం భారత వాయుసేన నిర్వహించిన ఎయిర్‌ స్ట్రైక్స్‌, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ భారత్‌కు తిరిగి రావడం లాంటి విషయాల్లో చురుగ్గా స్పందించారు.

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు