హేమంత్ కర్కరేపై సాధ్వీ ప్రగ్యాసింగ్‌ వ్యాఖ్యలు: ఈసీ నోటీసులు

By Siva KodatiFirst Published Apr 20, 2019, 5:51 PM IST
Highlights

బీజేపీ మహిళా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ఎన్నికల కమీషన్‌ నోటీసులు జారీ చేసింది. 26/11 ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై సాధ్వి చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

బీజేపీ మహిళా నేత సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ఎన్నికల కమీషన్‌ నోటీసులు జారీ చేసింది. 26/11 ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై సాధ్వి చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇవి రాజకీయంగా తీవ్ర కలకలం రేపడంతో దీనిని సుమోటాగా స్వీకరించిన ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు జారీ చేసింది. సాధ్వీ వ్యాఖ్యలపై జిల్లా ఎన్నికల అధికారి, భోపాల్ జిల్లా కలెక్టర్ స్పందించారు.

ఆమె వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించామని.. దీనిపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నుంచి నివేదిక వచ్చిందని.. దీనిని పరిశీలించిన అనంతరం సాధ్వీకి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.

దీనికి ఆమె 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని తెలిపారు. కాగా... గురువారం రాత్రి భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో సాధ్వీ మాట్లాడుతూ.. హేమంత్ కర్కరే తన శాపం వల్లే మరణించారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మాలెగావ్ పేలుళ్ల కేసులో తనను కర్కరే చిత్రహింసలకు గురిచేసినందున సర్వనాశనమైపోతావని శపించానని.. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన మరణించారని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రధాని క్షమాపణలు చెప్పాలని, ప్రజ్ఞాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  

click me!