ఓటు వేయని రమ్య... నెటిజన్ల విమర్శలు

By telugu teamFirst Published Apr 20, 2019, 10:59 AM IST
Highlights

కాంగ్రెస్ మహిళా నేత రమ్య.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో.. ఆమెపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

కాంగ్రెస్ మహిళా నేత రమ్య.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో.. ఆమెపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక సెలబ్రెటీ అయ్యి ఉండి  ఓటు కూడా వేయకపోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. 

ఇటీవల రెండో దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రజలు, సినీ ప్రముఖులు క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. అయితే...ఓటు వేయడానికి వచ్చినవారిలో సినీనటి, కాంగ్రెస్ నేత రమ్య కనిపించకపోవడం గమనార్హం. దీంతో.. ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

ఒకసారి మండ్య నుండి పోటీ చేసి గెలిచిన రమ్య అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత విధాన సభ ఎన్నికలలో అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయలేదు.  మండ్యలో ఓటు వేయటానికి కూడ రాకపోవటంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు ప్రజలు కూడ రమ్యపై నిప్పులు కక్కుతున్నారు. 

నటిగా, రాజకీయ నాయకురాలిగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న రమ్య ఓటు వేయకు పోవటంవల్ల ఇతరులకు ఓటు వేయమని అడిగే హక్కు కూడా రమ్యకు లేదని నిలదీస్తున్నారు.  రమ్య ఓటు వేయకపోవడం ఇదేమీ  తొలిసారి కాదు..గతంలో రెండుసార్లు ఆమె ఇలానే చేశారు. వరసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓటు వేయకుండా రమ్య హ్యాట్రిక్ కొట్టారంటూ సెటైర్లు వేస్తున్నారు. 
 

click me!