అమ్మను కోల్పోయిన ప్రజలకు వదినలా అండగా వుంటా: ప్రేమలత విజయకాంత్‌

By Arun Kumar PFirst Published Apr 13, 2019, 2:01 PM IST
Highlights

రాష్ట్ర ప్రజలను సొంత బిడ్డల్లా ఆదరించిన జయలలిత అకస్మిక మరణంతో తమిళ ప్రజలు తల్లిలేనివారయ్యారని  డీఎండీకే నాయకురాలు ప్రేమలత విజయకాంత్‌ ఆవేధన వ్యక్తం చేశారు. అలా తల్లి ప్రేమను కోల్పోయి బాధలో వున్న ప్రజలకు ఓ వదినమ్మగా మారి ప్రేమను పంచడానికి తాను సిద్దంగా వున్నానన్నారు. అందుకోసం  లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రేమలత ప్రజలను కోరారు. 

ప్రస్తుతం డీఎండీకే పార్టీ కోశాధికారిగా పనిచేస్తున్న ప్రేమలత తమ పార్టీ లోక్ సభ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ...ఈ ఎన్నికలను ఓ దర్మయుద్దంతో పోల్చారు. తమళ ప్రజలు న్యాయం వైపే నిలుస్తారన్న నమ్మకముందని పేర్కొన్నాడు. తమ  పార్టీతో పాటు అధికార అన్నాడీఎంకేలోని అన్ని పార్టీలు న్యాయానికి మార్గదర్శిగా వున్నాయని తెలిపారు. 

రాష్ట్ర ప్రజల ఆకలి బాధను సొంత తల్లి మాదిరిగా గుర్తించి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లను ప్రారంభించారని గుర్తుచేశారు. ఇలా నిరుపేదలకు మూడు పూటల కడుపు నిండా అన్నం పెట్టి ఆదుకున్నారని ప్రశంసించారు. కేవలం ఇది మాత్రమే నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచిన మహా నాయకురాలు జయలలిత అంటూ ప్రేమలత పొగిడారు. 

అయితే అలాంటి మహానాయకురాలి మృతి తర్వాత అలమటిస్తున్న తమిళ ప్రజలకు వదినమ్మలా మారి అండగా వుంటానన్నారు. కాబట్టి ఆ అమ్మను ఆదరించినట్లే ఈ వదినమ్మను కూడా ఆదరించాలని కోరారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులను బంఫర్ మెజారిటీలతో గెలిపించాలని ప్రేమలత విజయకాంత్ ప్రజలను కోరారు. 

click me!