ఓటు కోసం: సద్ది మూటలు కట్టుకుని.. 8 గంటలు నడిచి

By Siva KodatiFirst Published May 7, 2019, 7:49 AM IST
Highlights

ఓటు హక్కు వినియోగించుకోవడానికి 300 మంది ఎనిమిది గంటల పాటు నడిచి తమ బాధ్యతను నిర్వర్తించారు

ఓటు వేయడం మన బాధ్యత. కాని దానిని సక్రమంగా నిర్వర్తించేది కొందరే. వందేళ్లు దాటిన వృద్ధులు సైతం ఓటు వేయడానికి ఉత్సాహం చూపుతుంటే యువత మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.

ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి 300 మంది ఎనిమిది గంటల పాటు నడిచి తమ బాధ్యతను నిర్వర్తించారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న బందర్‌పని గ్రామస్తులకు రవాణా సదుపాయాలు లేవు.. బాహ్యప్రపంచంలో ఏం జరుగుతోందో కాదు వారికి తెలియదు.

అయినప్పటికి వారు ప్రతి ఎన్నికల్లోనూ తప్పకుండా ఓటేస్తారు. తమ నియోజకవర్గంలో  ఎవరెవరు బరిలో ఉన్నారో కూడా కనీసం వారికి తెలియదు. చింద్వారాకు చెందిన 60 గిరిజన కుటుంబాలు 2001లో బందర్‌పని కొండల్లోకి మకాం మార్చారు.

తాము అడవితల్లి బిడ్డలమని, అందుకే అడవిలోకి వచ్చామని, ఇక్కడే సాగు చేసుకుంటూ బతుకుతున్నామని వారు చెబుతున్నారు. ఇప్పటికీ గ్రామంలో కనీస సదుపాయపాలు లేవు..

ఓటేస్తే గెలిచిన వారు తమ గ్రామానికి రోడ్డు, స్కూలు వంటివి ఏర్పాటు చేస్తారని కొందరు నమ్ముతుంటే.. ఓటేయ్యకపోతే తమ పేర్లను కొట్టేస్తారేమోనన్న భయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వీరు మాత్రం ఓటు వేయడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయరు. 

click me!