కాంగ్రెస్ లో చేరిన సినీ నటి ఊర్మిళ

Published : Mar 27, 2019, 03:31 PM IST
కాంగ్రెస్ లో చేరిన సినీ నటి ఊర్మిళ

సారాంశం

ప్రముఖ బాలీవుడ్ సినీ నటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆమె రాహుల్ ని కలిశారు. 

ప్రముఖ బాలీవుడ్ సినీ నటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆమె రాహుల్ ని కలిశారు. ఆమెకు పార్టీ కండువా అందజేసి.. రాహుల్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.  ఊర్మిళ వెంట మహారాష్ట్ర విభాగం కాంగ్రెస్ చీఫ్ మిలింద్ డియోరా, సీనియర్ నేత సంజయ్ నిరూపమ్ ఉన్నారు.

ఊర్మిళ గత కొంతకాలంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. నేడు ఆ వార్తలు నిజమయ్యాయి.  ఊర్మిళ ముంబయి నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ ఓ ప్రకటన వెలువరించనున్నట్లు తెలుస్తోంది. ముంబై నార్త్ నుంచి పోటీ చేసేందుకు ఊర్మిళ ఆసక్తి చూపుతున్నారని, దీనిపై తుదినిర్ణయం పార్టీ తీసుకుంటుందని పార్టీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

మోదీ ప్రమాణ స్వీకారం... స్టాలిన్ కి అందని ఆహ్వానం
మోదీ ప్రమాణస్వీకారం... ముఖ్య అతిథులు.. నోరూరించే వంటలు