టికెట్ ఇవ్వలేదనే కోపంతో.. కుర్చీలు ఎత్తుకెళ్లాడు

By ramya NFirst Published Mar 27, 2019, 11:32 AM IST
Highlights

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సమయం నడుస్తోంది. ఎక్కడ విన్నా.. టికెట్లు, అభ్యర్థులు, నామినేషన్లు ఇవే వినపడుతున్నాయి. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సమయం నడుస్తోంది. ఎక్కడ విన్నా.. టికెట్లు, అభ్యర్థులు, నామినేషన్లు ఇవే వినపడుతున్నాయి. కొంత మందికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు దొరకుతుండగా.. మరికొందరు ఆశావాహులకు లభించడంలేదు. టికెట్ దక్కినవారంతా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. దొరకనివారు బాధపడటం లేదా పార్టీలు మారడం, మహా అంటే ప్రచారానికి దూరంగా ఉండటం లాంటివి చేస్తున్నారు. అయితే.. ఎ ఓ వ్యక్తి చేసిన పని మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇంతకీ మ్యాటరేంటంటే...మహారాష్ట్ర ఎన్నికల్లో ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. అయితే.. అతనికి కాకుండా పార్టీ మరొకరికి టికెట్ కేటాయించింది. దీంతో.. ఆయన కోపంతో ఊగిపోయారు. వెంటనే.. పార్టీ ఆఫీసులో ఉన్న 300 కుర్చీలను తన మద్దతుదారుల సహాయంతో అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయాడు.

తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని..పార్టీ ఆఫీసులో ఉన్న 300 కుర్చీలు తనకు చెందినవని చెప్పి.. వాటిని తీసుకొని వెళ్లిపోయాడు. పార్టీ నేతలందరూ కలిసి సమావేశం జరుగుతండగా.. వాళ్లని లేపి మరీతన కుర్చీలు ఆయన తీసుకొని వెళ్లిపోవడం గమనార్హం. తనకు కాదని టికెట్ ఎవరకి ఇచ్చారో.. వాళ్లతో కుర్చీలు తెప్పించుకోవాలని పార్టీకి ఉచిత సలహా కూడా ఇచ్చారు. 

ఆయన ఈ వచ్చే ఎన్నికల్లో ఔరంగాబాద్ టికెట్ ఆశించారు.. కానీ పార్టీ వేరొకరికి కేటాయించడంతో మనస్థాపానికి గురైన ఆయన ఈ విధంగా వ్యవహరించారు.

click me!