లోక్‌సభ ఎన్నికల్లో జగన్‌దే హవా: 25లో 22 వైసీపీకే

By Siva KodatiFirst Published Mar 11, 2019, 10:59 AM IST
Highlights

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఏపీలో జనం నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు జాతీయ స్థాయి సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఏపీలో జనం నాడి ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు జాతీయ స్థాయి సర్వే సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీదే హవా అని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్‌ ఒపీనియన్ పోల్స్ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 22 చోట్ల, టీడీపీ 3 స్ధానాల్లో విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే నరేంద్రమోడీ సారథ్యంలోని ఎన్టీయే సాధారణ మెజారిటీ సాధించినా 2014తో పోలిస్తే సుమారు 70 సీట్లు కోల్పోయే అవకాశమున్నట్లు వివరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 మేజిక్ ఫిగర్ కాగా, బీజేపీ సొంతంగా 238 చోట్ల, కూటమి 285 స్ధానాల్లో గెలుపొందుతుందని సర్వే పేర్కొంది.

2014లో 282 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ ఈసారి 44 స్ధానాలను కోల్పోయి 238 సీట్లను కైవసం చేసుకునే అవకాశముందని తెలిపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో 80 స్థానాలకే పరిమితమైన యూపీఏ ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది.

దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లో 71 సీట్లు గెలిచి ఆధిపత్యం ప్రదర్శించిన బీజేపీ... ఈసారి కేవలం 40 స్థానాలకే సరిపెట్టుకోనుందట. అలాగే మాయవతి నేతృత్వంలోని బీఎస్పీ 16, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ 18 సీట్లను గెలుచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1 చోట గెలుస్తాయని పేర్కొంది. 

click me!