ఓపీనియన్ పోల్స్ ఫలితాల్లో పస ఎంత

By narsimha lodeFirst Published Mar 5, 2019, 6:23 PM IST
Highlights

2004 నుండి ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ కానీ, ఓపీనియన్ పోల్స్‌ కానీ ఐదు దఫాలు తప్పయ్యాయి. ఆయా సంస్థలు ఇచ్చిన ఫలితాలకు భిన్నంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు.

న్యూఢిల్లీ: 2004 నుండి ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్స్ కానీ, ఓపీనియన్ పోల్స్‌ కానీ ఐదు దఫాలు తప్పయ్యాయి. ఆయా సంస్థలు ఇచ్చిన ఫలితాలకు భిన్నంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు.

2004 ఎన్నికల సమయంలో ఆజ్‌తక్, ఎన్డీటీవీ,  నీల్సన్ ఓఆర్జీ  సంస్థలు   ఎన్డీఏకు 255 , యూపీఏకు 183,  ఇతరులకు 105 స్థానాలు వస్తాయని తేల్చారు. కానీ వాస్తవానికి ఎన్డీఏకు 187, యూపీఏకు 219, ఇతరులకు 137 ఎంపీ స్థానాలు దక్కాయి.  ఇతరులను కలుపుకొని యూపీఏ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

 2014 ఎన్నికల సమయంలో కూడ అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని  తేల్చాయి. ఎన్డీఏకు 265, యూపీఏకు 100,  ఇతరులకు 155 ఎంపీ స్థానాలు వస్తాయని ఈ సర్వే సంస్థలు తేల్చాయి. వాస్తవానికి ఎన్డీఏకు 336, యూపీఏకు 60, ఇతరులకు 147 ఎంపీ స్థానాలు దక్కాయి.

బీజేపీ అధికారంలోకి వస్తోందని సర్వేలు  చెప్పినా కూడ వన్‌సైడ్‌గా ఎంపీ సీట్లను బీజేపీ కైవసం చేసుకొంది. 2017 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ అన్ని సర్వే సంస్థలు 225 ఎంపీ సీట్లను కైవసం చేసుకొంటాయని సంస్థలు ప్రకటించాయి. కానీ, ఈ ఎన్నికల్లో  బీజేపీ 325 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొంది.  

2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ బీజేపీకి 115 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని సర్వే సంస్థలు తేల్చాయి. అయితే కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ కూటమికి 110 సీట్లు వస్తాయని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. అయితే ఈ సంస్థలను సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ మహాకూటమి 178 ఎమ్మెల్యే సీట్లను కైవసం చేసుకొని నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

బీజేపీ కేవలం 58 ఎమ్మెల్యే స్థానాలకే పడిపోయింది. 2015 లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ  లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రమే ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఉంది. బీజేపీకి 20, ఆప్ కు 45, కాంగ్రెస్ కు 3 స్థానాలు వస్తాయని సర్వే సంస్థలు తేల్చాయి.  కానీ వాస్తవానికి బీజేపీకి మూడు,  ఆప్‌కు 67 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడ దక్కలేదు.

click me!