ఎన్డీటీవీ అంచనా: ఎపిలో జగన్ జోరు, చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలే

By telugu teamFirst Published Apr 8, 2019, 7:08 AM IST
Highlights

ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎన్డీటీవీ సర్వే తేల్చింది. ప్రాంతీయ పార్టీలు 106 సీట్ల దాకా గెలుచుకుంటాయని అభిప్రాయపడింది. 

అమరావతి: ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎన్డీటీవీ సర్వే తేల్చింది. ప్రాంతీయ పార్టీలు 106 సీట్ల దాకా గెలుచుకుంటాయని అభిప్రాయపడింది. ఎన్డీటీవీ ఆదివాతం తన అంచనా ఫలితాలను ప్రచురించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 25 లోకసభ స్థానాల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు 20 పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధిస్తుందని, తద్వారా ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. 

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 30, తమిళనాడులో డీఎంకే 25 ఎంపీ సీట్లలో విజయం సాధించి మొదటి, రెండో స్థానాలను ఆక్రమిస్తాయని చెప్పింది. ఒడిశాలో బిజూ జనతాదళ్‌ 16 సీట్లు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 15 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు చెప్పింది. 

ఈ నేపథ్యంలో మొత్తం 106 ఎంపీ సీట్లతో ప్రాంతీయ పార్టీల మద్దతు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తేల్చింది.

click me!