కేసీఆర్ సర్వే: టీఆర్ఎస్ కు 16 సీట్లు, మజ్లీస్ కు ఒక్కటి

By telugu teamFirst Published Apr 1, 2019, 11:03 AM IST
Highlights

తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అంతర్గత సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ బలం ఏ మాత్రం చెక్కుచెదరలేదని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అంతర్గత సర్వే నిర్వహించారు. తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో టీఆర్ఎస్ కు 16 సీట్లు, మజ్లీస్ కు ఒక్క సీటు వస్తాయని ఆ సర్వేలో తేలినట్లు సమాచారం. 

కాంగ్రెసు సహా ఇతర పార్టీలేవీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేపని తేల్చేసింది. ప్రతి నియోజకవర్గంలోని ఆరేడు మండలాలను లేదా డివిజన్లను, ఆ తర్వాత ప్రతి మండలం లేదా డివిజన్ లో ఏడు నుంచి తొమ్మిది గ్రామాలను ఎంచుకు ఈ సర్వే నిర్వహించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

సర్వేకు 80,678 మంది మహిళలను ఎంచుకుంటే, వారిలో 62.29 శాతం మంది టీఆర్ఎస్ కు అనుకూలంగా స్పందించారని, 26.27 శాతం మంది కాంగ్రెసుకు అనుకూలంగా స్పందించారని సమాచారం. సర్వేకు 1,07,938 మంది పురుషులను ఎంచుకోగా, వారిలో 53.84 శాతం మంది టిఆర్ఎస్ కు అనుకూలంగా స్పందించారని, 29.29 శాతం మంది కాంగ్రెసు కు అనుకూలంగా ఉన్నారని తేలింది.

click me!