మమతకు తిరుగులేని దెబ్బ: బిజెపికి రెండంకెల సీట్లు

By telugu teamFirst Published May 19, 2019, 8:55 PM IST
Highlights

తాను ఎగ్జిట్ పోల్ ఫలితాలను తాను నమ్మబోనని, నమ్మాల్సిన అవసరం లేదని దీదీ అన్నారు. వేలాది ఈవీఎంలను మానుప్యులేట్ చేయడానికి ఈ ఎగ్జిట్ పోల్ పుకార్లను ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. 

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో బిజెపిపై వీరపోరాటం చేసిన మమతా బెనర్జీ నాయకత్వంలోని మమతా బెనర్జీకి ఎదురు దెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఆ సూచన చేస్తున్నాయి. బిజెపి రెండు స్థానాల నుంచి రెండంకెల స్థానాలకు చేరుకుంటుందని అంచనా వేశాయి. 

ఈ స్థితిలో తాను ఎగ్జిట్ పోల్ ఫలితాలను తాను నమ్మబోనని, నమ్మాల్సిన అవసరం లేదని దీదీ అన్నారు. వేలాది ఈవీఎంలను మానుప్యులేట్ చేయడానికి ఈ ఎగ్జిట్ పోల్ పుకార్లను ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. 

ఇదిలావుంటే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం బిజెపి పశ్చిమ బెంగాల్ లో తన పరిస్థితిని మెరుగుపరుచుకుంటుందని చెబుతున్నాయి. 

టీఎంసీకి 24, బిజెపికి 16, కాంగ్రెసు కూటమికి రెండు సీట్లు వస్తాయని ఎబిపీ అంచనా వేసింది. 

ఇండియా టుడే -ఆక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాల ప్రకారం టీఎంసి 19 -22 స్తానాలను, బిజెపి 19-23 స్థానాలు, కాంగ్రెసు 0 నుంచి 1 స్థానాలు వస్తాయి. 

రిపబ్లిక్ - జన కీ బాత్ అంచనా ప్రకారం బిెజపి 18 నుంచి 26 స్థానాలు, టీఎంసికి 13 నుంచి 21 స్థానాలు వస్తాయి. 

టైమ్స్ నౌ విఎంఆర్ సర్వే ప్రకారం - బిజెపికి 11 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 2 సీట్లు, టీఎంసికి 29 సీట్లు, ఇతరులకు 1 సీటు వస్తాయి. 

click me!