తమిళనాడు ఎన్నికల చిత్రం: విజయ్‌కాంత్‌తో పొత్తే కీలకం

By narsimha lodeFirst Published Mar 5, 2019, 12:38 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలో డీఎండికే పార్టీతో పొత్తు కోసం  ప్రధాన పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి అధికారంలోని అన్నాడీఎంకె నేతలు సోమవారం నాడు డీఎండీకే చీఫ్  విజయ్‌కాంత్‌తో  సోమవారం నాడు చర్చలు జరిపారు.


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో డీఎండికే పార్టీతో పొత్తు కోసం  ప్రధాన పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి అధికారంలోని అన్నాడీఎంకె నేతలు సోమవారం నాడు డీఎండీకే చీఫ్  విజయ్‌కాంత్‌తో  సోమవారం నాడు చర్చలు జరిపారు. బుధవారం నాడు తమిళనాడు రాష్ట్రంలో ప్రధానమంత్రి ర్యాలీకి ముందే డీఎండీకే పార్టీతో పొత్తు విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నాడీఎంకె వర్గాలు ప్రకటించాయి.

అన్నాడీఎంకె నేత, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రి జయకుమార్‌లు సోమవారం నాడు డీఎండికె నేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఇటీవలనే అమెరికాలో వైద్య చికిత్స చేసుకొన్న తర్వాత విజయ్‌కాంత్ స్వంత రాష్ట్రానికి తిరిగి వచ్చారు.

విజయ్‌కాంత్  స్వంత రాష్ట్రానికి తిరిగి రాగానే  కాంగ్రెస్, డీఎంకే కూటమి, అన్నాడీఎంకే, బీజేపీ కూటమిల నుండి విజయ్‌కాంత్‌కు ఫోన్లు వచ్చాయి.సోమవారం నాడు అన్నాడిఎంకె నేతలు విజయ్‌కాంత్‌తో చర్చించారు. ఈ చర్చలు కొనసాగుతాయని పన్నీర్ సెల్వం ప్రకటించారు. విజయ్ కాంత్ ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు వచ్చినట్టుగా పన్నీర్ సెల్వం తొలుత చెప్పారు.

అతని ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకొంటున్నట్టుగా ఆయన చెప్పారు. తమతో విజయ్ కాంత్ సంతోషంగా మాట్లాడినట్టుగా పన్నీర్ సెల్వం మీడియాకు చెప్పారు.

డీఎండీకె సీనియర్ నాయకుల సమావేశాన్ని మంగళవారం నాడు ఏర్పాటు చేసింది. అన్నాడీఎంకె -బీజేపీ కూటమిలో డీఎండీకే చేరే అవకాశం ఉందని సమాచారం. ఇవాళ నిర్వహించే సమయం తర్వాత అన్నాడిఎంకెతో పొత్తు విషయాన్ని ఆ పార్టీ నేతలు ప్రకటించే చాన్స్ ఉందంటున్నారు.

డీఎండీకేతో పీఎంకే పొత్తు విషయమై చర్చలు జరిగినట్టు సమాచారం. ఏడు ఎంపీ సీట్లతో పాటు ఓ రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. అయితే ఐదు ఎంపీ సీట్లతో పాటు ఒక్క రాజ్యసభ సీటు ఇచ్చేందుకు మాత్రమే పీఎంకే అంగీకరించినట్టు సమాచారం. దీంతో అన్నాడీఎంకే కూటమితో డీఎండీకే చేతులు కలిపే అవకాశం ఉందంటున్నారు.

అయితే డీఎండీకేకు ఎన్ని సీట్లు ఇస్తారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఇవాళ కానీ, రేపు కానీ ఈ విషయమై స్పష్టత రానుందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు.అంతేకాదు తమిళనాడు రాష్ట్రంలో ప్రధాని పాల్గొనే సభలోనే ఈ కూటమి విషయాన్ని ప్రకటించనున్నట్టుగా పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు.


 

click me!