ఒకప్పుడు ప్రశ్నించిన గొంతులు అధికార బలం ముందు పెదవి విప్పక మూగబోయిన కలాల సిరా అక్షరాలు పిడికిల్లెత్తెదేప్పుడో ? అంటూ యరకల యాదయ్య రాసిన కవిత 'వెలుగురేకలౌదాం' ఇక్కడ చదవండి :
నిజాలు సమూహాలకు అధిపతులు
అణగారిన జనం బతుకులకు జీవనాధార దిక్సూచిలై
అమరమై బతకాలి బతికించాలి
అధర్మంగ గమ్యం చేరుకోవడానికి
ఎందరినో బలి చేస్తే !
ఒకప్పుడు ప్రశ్నించిన గొంతులు
అధికార బలం ముందు పెదవి విప్పక
మూగబోయిన కలాల సిరా అక్షరాలు
పిడికిల్లెత్తెదేప్పుడో ?
పంచభూతాలను విడి విడిగా చూస్తే
వాటికి ప్రాణమే కనిపించదు
అవి ఏకమై ప్రకృతికి ఊపిరిపోసే అంతర్భాగాలే
కంటి చూపుకు దేహాస్పర్శకు కనిపించే దైవాలు
undefined
ఎవ్వరికి వారమే సామాన్యులం
కలసిగట్టుగ నడిస్తే
కార్యాచరణకు వెలుగు దివ్వెలం
ప్రగతి రధ చక్రాలు పయనిస్తున్నప్పుడు
రాళ్లు రప్పలు అడ్డు తగలడం సహజమే
పెద్దవైతే పెగిలిద్దాం
చిన్నచిన్నవైతే పక్కకు తొద్దాం
పాలు పారబోయడం కాదు
పాలు పంచుకుందాం
పెద్ద తరహ అంటే పెత్తనం కాదు
సాధించుకున్న స్వతంత్రాన్ని
రాసుకున్న రాజ్యాంగాన్నీ
నిజంవైపు నిలబెడదాం
ఆలోచనల్ని కూడగడదాం
భావితరాలకు వెలుగురేకలౌదాం