వన్ బై టు ఛాయే ఎన్నెన్ని సంగతులు ముందుకు తెన్తున్నదో అంటూ కందాళై రాఘవాచార్య రాసిన కవిత ' వన్ బై టూ ఛాయ్ దోస్తాన ' ఇక్కడ చదవండి :
చార్ మినార్
చౌరస్తాలో ఇద్దరు మిత్రులు
అనుకోకుండా కలిసి
అనుకోని
వన్ బై టు ఛాయ్ తాగుతుంటే
నాల్గు దిక్కుల ముచ్చట్లు నాల్కల మీద ఒకటైతున్నై
చల్లారిందీ తెలుస్త లేదు
ముచ్చట్లే ఎక్కువ
ఛాయ్ తాగుతుంటే ఇంకిపోదు మరి !
మైత్రీ సంభాషణకు విరామ చిహ్నలే !
పుల్ స్టాపులు లేవు
వన్ బై టు ఛాయే ఎన్నెన్ని సంగతులు ముందుకు తెన్తున్నదో
ఇప్పుడు తాగుతున్నది టీ అయినా
గతం చేదు ముచ్చట కన్నీళ్లను తెప్పిస్తున్నది
కఠిన అనుభవాలు ఉప్పుతనంగా సముద్రం హోరే !
మధ్య మధ్య సంతోషం రోజులు వచ్చినపుడు
టీ లో వేయకుండానే చక్కెర ఎక్కువగా ధారాపాతం
చెంచలు చెంచలు
undefined
ఇంకో ఛాయ్ తెప్పించుకుంటారేమో
ఎప్పుడు కలుస్తారో మళ్లీ
సెల్ఫీ తీసుకోక ఎలా కదులుతారు
వన్ బై టు ఛాయ్ సమయం
దోస్తానాగా ఎప్పటికీ జ్ఞాపకంగా
ఉండి పోవాలిగా
క్లిక్ క్లిక్ క్లిక్
ఛాయ్ వన్ బై టు
మాటలు పుల్ పుల్ !