కవి "వసీరా" కు ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు

Published : Feb 08, 2023, 05:21 PM IST
కవి "వసీరా" కు ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ అవార్డు

సారాంశం

35 వ ఉమ్మడిశెట్టి సత్యా దేవి సాహితీ అవార్డు -2022 కోసం ప్రసిద్ధ సీనియర్ కవి వసీరా  "సెల్ఫీ" కవితా సంపుటి ఎంపికైనట్లు అవార్డు వ్యవస్థాపకులు డా. రాధేయ ప్రకటించారు. ఈ అవార్డుకు న్యాయ నిర్ణేతలుగా కొప్పర్తి వెంకట రమణ మూర్తి, డా.నాళేశ్వరం శంకరం, మందరపు హైమవతి వ్యవహరించారు.  

సత్యాదేవి సాహితీ అవార్డు  అవార్డు పొందిన  "సెల్ఫీ" వసీరా మూడవ కవితా సంపుటి. వీరు 1980 నుంచీ రాస్తున్న సీనియర్ కవి. వసీరా " సెల్ఫీ "  కవిత్వంలో సమస్త విశ్వాన్నీ ఆలింగనం చేసుకొనే ఒక అద్వితీయ దివ్యానుభవం మనకు కల్గుతుం దని న్యాయ నిర్ణేతలు అభిప్రాయ పడినట్లుగా డా. రాధేయ  వివరించారు.

ఈ అవార్డు పొందిన కవుల్లో వసీరా 35 వ వారు. త్వరలో అనంతపురంలో జరిగే సభలో కవికి అవార్డు ప్రదానం చేయనున్నట్టు ఉమ్మడి లిటరరీ ట్రస్ట్, అనంతపురం తరఫున డా. రాధేయ తెలియజేశారు.


 
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం