ప్రముఖ కథకులు భమిడిపాటి జగన్నాథరావు ఇకలేరు..

By SumaBala Bukka  |  First Published Feb 7, 2023, 8:53 AM IST

ప్రముఖ కథకులు, కథా ప్రేమికులు భమిడిపాటి జగన్నాథరావు ఇక లేరు. సోమవారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. 


ప్రముఖ కథకులు, కథా ప్రేమికులు భమిడిపాటి జగన్నాథరావు సోమవారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. భమిడిపాటి జగన్నాథరావు గారి స్వస్థలం కృష్ణాజిల్లా. ప్రముఖ కథారచయిత, 1934, డిసెంబర్ 1న కృష్ణాజిల్లా, గుడివాడలో జన్మించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎం.ఎ. పట్టా నాగపూర్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నారు. 

మంచి కథకుడిగా, ప్రభావశీల రచయితగా భమిడిపాటి జగన్నాథరావు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. ఆయనకు కథారచన ప్రవృత్తి. వృత్తి రీత్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్ గా,  ఏపీ గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, పదవీ విరమణ చేశారు.

Latest Videos

undefined

తెలుగు రచయితల్లో భమిడిపాటి జగన్నాథరావుగారు ప్రత్యేకమైన కథకుడు. మొదటినుంచీ కథలు చదవడం, మంచి కథలను అందరితోనూ పంచుకోవడం, అద్భుతమైన కథకుల్ని గుర్తించడంలో ఆయన చేసేవారు. అలా ఆయన సాహిత్యలోకానికి పరిచయం చేసిన, కనుగొన్న రచయితల్లో త్రిపుర మొదటివాడు అనే అంటారు. చలం, పాలగుమ్మి పద్మరాజు, బుచ్చిబాబు ఆయనకు ఇష్టమైన రచయితలు. 

భమిడిపాటి జగన్నాథరావుగారు రాసినవి కొన్ని కథలే. ఇవి ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మాభూమి, జ్యోతి, జయశ్రీ, ఆహ్వానం, తెలుగు స్వతంత్ర, వార్త, రచన, నవ్య, చినుకు, ఇండియాటుడే లాంటి పత్రికల్లో అచ్చయ్యాయి. భమిడిపాటి జగన్నాథరావుగారు రాసిన కథలతో మూడు కథా సంపుటాలు వెలువడ్డాయి. 

ఆయన పుస్తకాలు భమిడిపాటి జగన్నాథరావు కథలు, పరస్పరం, మువ్వలు, అడుగుజాడలు అనే కథా సంపుటులుగా లభ్యమవుతున్నాయి. త్రిపుర ఓ జ్ఞాపకం అనే పుస్తకానికి అత్తలూరి నరసింహారావు, కె.కె.రామయ్యలతో కలిసి సంపాదకత్వం వహించారు.

ఇక ఆయన కథల్లో కొన్ని అనుతాపం అనురాగం, అడుగుజాడలు, అపరంజి పంజరం, చిత్రనళీనీయం, చూపు, చేదునిజం, జీవనరాగం,  జాజిపూలు, జీవితపు విలువలు, మంట్లో జాబిల్లి.. లాంటి మరిన్ని కథలు కథా నిలయంలో అందుబాటులో ఉన్నాయి. 

click me!