కవిత ఎత్తుగడ, ముగింపులో మెరుపు ఉండాలని, అక్కడక్కడ నోస్టాలజీని చేర్చడం వల్ల కవితకు బలం చేకూరుతుంది అని కవి,రచయిత ఎం. బ్రహ్మచారి (నిధి) అన్నారు.
హన్మకొండలో తెలంగాణ రచయితల సంఘం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ''కవిత్వంతో కలుద్దాం'' 17వ కార్యక్రమం ప్రముఖ కవి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ కవిగా విచ్చేసిన ప్రముఖ కవి,రచయిత ఎం, బ్రహ్మచారిని సీనియర్ రచయిత్రి చందనాల సుమిత్ర సభకు పరిచయం చేస్తూ నాలుగు దశబ్ధాలుగా నిధి సాహిత్యానికి సేవ చేయడం అభినందనీయం అన్నారు.
ఎం. బ్రహ్మచారి కవులకు దిశా నిర్దేశం చేస్తూ కవిత ఎత్తుగడ, ముగింపులో మెరుపు ఉండాలని... అక్కడక్కడ నోస్టాలజీని చేర్చడం వల్ల కవితకు బలం చేకూరుతుంది అన్నారు. అరిగిపోయిన పదాలను కవిత్వంలో ఎక్కువగా వాడకుండా జాగ్రత్త పడాలని, ఒక కవితలో భిన్నమైన అంశాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కవితలో స్పష్టత ఉండదని సూచించారు.
కార్యక్రమానికి హాజరైన కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత డా.అంపశయ్య నవీన్ మాట్లాడుతూ... సంస్కారవంతమైన హృదయాంతరంగం నుండే కవిత్వం వెలుబడుతుందని అన్నారు. ఈ సందర్భంగా కవి బిల్ల మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన కవిత్వ పఠన కార్యక్రమంలో దాదాపు 25 పైగా కవులు పాల్గొని వారి కవితలను వినిపించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి నెల్లుట్ల రమాదేవి, నాగిళ్ళ రామశాస్త్రి, విఆర్ విద్యార్థి, వాణి దేవులపల్లి, పల్లేరు వీరస్వామి, శనిగరపు రాజమోన్, అరుణ్ జ్యోతి, రామ రత్నమాల, నాగబల్లి జితేందర్, పాకాల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ఏరుకొండ నరసింహస్వామి, అంజనీదేవి, మధుకర్ రావు, మార్కర్ శంకరనారాయణ, మాదారపు వాణిశ్రీ, శివరంజని కందకట్ల జనార్ధన్, కార్తీకరాజు, బూరబిక్షపతి, కుమారస్వామి, లీలా, చందర్రావు, మల్లేష్, ఆసనాల శ్రీను, సొన్నాల కృష్ణవేణి, లెనిన్, కామిడి సతీష్, రాధిక, స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.