మీ రచనలను, చక్కగా, స్పష్టంగా, అచ్చుతప్పులు లేకుండా, అర్థమయ్యేలా తెలుగులో టైప్ చేసి Venugopal.b@asianetnews.in అనే మెయిల్ ఐడీకి నేరుగా పంపండి.
ప్రముఖ కవులు, రచయితలు మొదలనుకుని సాహితీ రంగంలో కవులుగా, రచయితలుగా వస్తున్న ఔత్సాహికులు, యువకవులు, రచయితలకు ఏసియా నెట్ తెలుగు చక్కటి వేదికగా మారిందన్న విషయం తెలిసిందే. అర్ధ దశాబ్దానికి పైగా వారి సృజనను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ వస్తోంది.
దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని.. మరింతమంది సాహిత్యకారుల చెంతకు చేర్చాలని, ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో ఏసియానెట్ తెలుగు మరో ముందడుగు వేస్తోంది. రచయితలే తమ రచనలను తమంతట తామే నేరుగా ఏసియా నెట్ తెలుగుకు చేరవేసే సౌలభ్యం కల్పిస్తోంది. మీరు పంపిన రచనల్లో అర్హమైన వాటిని సాహిత్యం (లిటరేచర్) విభాగంలో ప్రచురిస్తాం.
దీనికోసం మీరు చేయాల్సిందల్లా... మీ రచనలను, చక్కగా, స్పష్టంగా, అచ్చుతప్పులు లేకుండా, అర్థమయ్యేలా తెలుగులో టైప్ చేసి Venugopal.b@asianetnews.in అనే మెయిల్ ఐడీకి నేరుగా పంపండి.
మీ రచనలతో పాటు మీ ఫోన్ నంబర్, అవసరమైన ఫొటోలు పంపడం మరిచిపోవద్దు. అలాగే కవిత లేదా రచన స్వయంగా మీరే రాసినట్లు పేర్కొనాలి. కాపీ కంటెంట్ ను ఏసియానెట్ ప్రోత్సహించదు. ఒకవేళ కంటెంట్ కాపీ చేసి పంపినట్లు తేలితే చట్టపరమైన చర్యలకూ బాధ్యులవుతారు.
- వేణుగోపాల్ బొల్లంపల్లి | ఎడిటర్ ఏసియా నెట్ తెలుగు