సూర్యోదయం కానిదే ఓటు రహస్యం గుట్టు విప్పదు! అంటూ
కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత ' ఈ చీకటి విడిపోదేమి?!' ఇక్కడ చదవండి :
కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత : ఈ చీకటి విడిపోదేమి?!
సూర్యోదయం కానిదే ఓటు రహస్యం గుట్టు విప్పదు! అంటూ
కోట్ల వెంకటేశ్వర రెడ్డి రాసిన కవిత ' ఈ చీకటి విడిపోదేమి?!' ఇక్కడ చదవండి :
ఈ రాత్రి
నరకానికి నఖలులా ఉంది
కన్న కలొకటి
ఈవియమ్ గుప్పిట్లో దాక్కుంది!
ఈ సారి
జనం నాడి
ఏ రాజకీయ వైద్యానికీ అందలే
ఓటరు తీరొక తీరని దాహం!
ఇవ్వాళ
హెచ్చరిక లేని ఋతు పవనాలు
ఆకస్మికంగా ఆవరించిన భ్రమ
అభ్యర్థుల హృదయాల్లో పెను తుఫాన్!
ఈ మార్పు
ఏ ఉత్తానానికో ఏ పతనానికో
సూర్యోదయం కానిదే
ఓటు రహస్యం గుట్టు విప్పదు!
సర్వ శక్తులొడ్డినా
ఊహించని ప్రమాదమొకటి
మద్యం గ్లాసులో ఐసు ముక్కై
క్షణ క్షణం వెక్కిరిస్తోంది!
కనికరం లేని కాలం
పోటీలోని అభ్యర్థులకు
ఊపిరాడనీయడం లేదు
గడియొక యుగం!
ఎటూ పాలు పోని వేళ
సినారె గీతమొకటి
లోలోన గుస గుసలు పోతున్నది