' వెంకటయ్య బావి' నవల ఆవిష్కరణ రేపే

By narsimha lode  |  First Published Dec 24, 2023, 12:13 PM IST

దాసరి  మోహన్ రచించిన ' వెంకటయ్య బావి ' నవల సోమవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో  నందిని సిధారెడ్డి  ఆవిష్కరిస్తారు.  ఈ సభ వివరాలు ఇక్కడ చదవండి : 


దాసరి  మోహన్ రచించిన ' వెంకటయ్య బావి ' నవల సోమవారం సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో  నందిని సిధారెడ్డి  ఆవిష్కరిస్తారు.  ఈ సభ తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖ  ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రముఖ రచయిత రూప్ కుమార్  డబ్బీ కార్  పుస్తక పరిచయం చేస్తారు.   కాంచన పల్లి గోవర్థనరావు ( తంగేడు),  పొత్తూరి సుబ్బారావు ( సాహితీ కిరణం) విశిష్ట అతిథులుగా, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు  నాళేశ్వరo శంకరం,   వఝల శివ కుమార్ , రమాదేవి కులకర్ణి  ఆత్మీయ అతిథులుగా వస్తున్నారని జంట నగరాల అధ్యక్షులు కందుకూరి శ్రీరాములు మరియు కార్యదర్శి బెల్లం కొండ సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 

గత కొంత కాలంగా కవిత్వం, కథలు రాస్తున్న  దాసరి మోహన్ ఇప్పుడు ' వెంకటయ్య బావి ' నవలతో పాఠకుల ముందుకు వస్తున్నారు.   వీరు గతంలో  దండెం (2019), అల్మారా (2021 ) కవితా సంపుటాలు మరియు 17 కథలతో  ' రాళ్ల కుచ్చె '  కథా సంపుటి వెలువరించిన పాఠకుల మన్ననలు అందుకున్నారు.  వీరు గతంలో నమస్తే తెలంగాణా  దిన పత్రిక నిర్వహించిన కవితల పోటీలో  ద్వితీయ  బహుమతి ( రూ.21,000 /- ) మరియు  పాలపిట్ట ,  సాహితీ కిరణం ,  విశాలాక్షి మాస  పత్రిక ఇతర సాహిత్య  సంస్థలు నిర్వహించిన  వివిధ కథల, కవితల పోటీలలో కూడా పలు బహుమతులు అందుకున్నారు.

Latest Videos

click me!