ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావును ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. సాహితీ రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.
ప్రముఖ రచయిత వేల్చేరు నారాయణరావును ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. సాహితీ రంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. ఆయన సాహిత్య అకాడమీ ఫెలోషిప్ నకు ఎంపికయ్యారు.
ఇప్పటి వరకు సాహిత్య అకాడమీ ఫెలోషిప్ నకు ఎంపికైనవారిలో వేల్చేరు నారాయణ రావు 14వ కవి. ఈ ఫెలోషిప్ ను కేంద్ర సాహిత్యఅకాడమీ తాను గుర్తించిన భారతీయ భాషల్లో సాహిత్య సేవ చేసినవరికి ఇస్తుంది. ప్రతీ యేటా భారతీయ భాషల్లో రచనలు చేసినవారికి ఈ పురస్కారం ఇస్తారు.
పరిశోధకుడు, అనువాదకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెల్చేరు.. ప్రసిద్ధ తెలుగు కావ్యాలను ఆంగ్లంలోకి అనువదించారు. శ్రీకాళహస్తీశ్వర శతకం, బసవ పురాణం, క్రీడాభిరామంతో పాటు కళాపూర్ణోదయం, కాళిదాసు, విక్రమోర్వశీయాన్ని అనువదించారు.
అన్నమయ్య, క్షేత్రయ్య సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. అమెరికాలో సుదీర్ఘకాలం తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన వేల్చేరు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొప్పాకలో జన్మించారు.