కోట్ల వెంకటేశ్వర రెడ్డి కవిత యస్ ' మా' మీరంతా నాన్ లోకలే! ఇక్కడ చదవండి.
ఈ మట్టి ఈ చరిత్ర
మీదెన్నటికీ కానప్పుడు
'మా'! మీరంతా నాన్ లోకలే!
ఇదంతా ఆదిపత్యాల కోసమే
అంతా కొత్త నాటకానికి తెర తీయడమే
వెండి తెర ఇప్పటికీ మా పై విసిరిన వలే!
undefined
సాగినంత కాలం
తెర మీద వెండి వెలుగు జిలుగుల నటన
పొద్దు వాలిందా జెండాలై మొలుస్తారు!
మీ వినోదం మంటగల్వ
'మా' మీ విష సంస్కృతి
ఎన్నటికీ ఎండని పంట కాలువ!
ఇక్కడ కరువొచ్చినా
భరించలేని కాటకమొచ్చినా
'మా'! మీది కదలిక లేని వింత పుంత!
అంతా వట్టిదే
' మా'! మీవంతా తెర మీది యుద్ధాలే
మేకప్ తీసేస్తే అందరూ మేక వన్నె పులులే!
ఇప్పటికీ మా భాషా
మా బ్రతుకులు ఎగతాళి అవుతుంటే
'మా'! మీ సమస్య మాదెన్నటికీ కాదు!!