గాయకుడు, కవి నిస్సార్ ఆకస్మిక మృతి: సాహితీలోకం దిగ్భ్రాంతి

Published : Jul 08, 2020, 01:51 PM ISTUpdated : Jul 08, 2020, 02:00 PM IST
గాయకుడు, కవి నిస్సార్ ఆకస్మిక మృతి: సాహితీలోకం దిగ్భ్రాంతి

సారాంశం

గాయకుడు, కవి నిస్సార్ ఆక,స్మికంగా మరణించారు. ఆయన మృతితో తెలుగు సాహిత్య లోకం దిగ్భ్రాంతికి గురైంది. ఆయన పాటలు రాసి, పాడుతూ వేదిక మీది నుంచి ప్రదర్శనలు ఇస్తూ వచ్చాడు.

హైదరాబాద్: కవి, గాయకుడు నిస్సార్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మృతి సాహితీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. పాటలు రాసి ఆలపిస్తూ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆయన మృతికి గల కారణం తెలియడం లేదు.

నిస్సార్ మృతికి సీఎం ఓస్డీడీ దేశపతి శ్రీనివాస్ సంతాపం ప్రకటించారు. ఆయనకు మల్లావఝ్జల సదాశివుడు పురస్కారం అందించినట్లు తెలిపారు. నిసార్ కు కన్నీటి నివాళి అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ దేశపతి శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

"నిస్సార్ తెలంగాణా పాటను సారవంతం చేసిన కళాకారుడు. ఆర్టీసీ కండక్టర్ గా పనిచేసిన నిసార్ తన పాటల ప్రయాణాన్ని అర్ధాంతరంగా ఆపేశాడు. నల్లగొండ జిల్లాఉద్యమచైతన్యాన్ని ఆవాహన చేసుకొన్నవాడు.  పేద ముస్లిం కుటుంబ లో పుట్టిన నిసార్ అనేక ఉద్యమాలకు పాటల ద్వారా ప్రాణవాయువు నిచ్చాడు" అని ఆయన అన్నారు.. 

"ప్రపంచీకరణ మాయలో కరిగిపోతున్న తెలంగాణా జానపద సాంస్కృతిక రూపాలను తలపోస్తూ వలపోసిన వాగ్గేయకారుడు. పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే అనే పాట తెలంగాణా ధూం ధాం సభలలో పెద్ద ఆకర్షణ. ప్రజానాట్యమండలి పతాకమైన వాడు. తెలంగాణా ఉద్యమ జ్వాలా గీతమైన వాడు నిసార్" అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం