సాహితీ వార్తలు: వలస దుఃఖం ఆవిష్కరణ, సాహిత్య సూచిక

By telugu team  |  First Published Jul 5, 2020, 10:21 AM IST

లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడిన వెతలను అక్షరీకరించిన రెండు తెలుగు రాష్ట్రాల లోని 110మంది కవుల కవిత్వ సంకలనం '"వలస దుఃఖం" పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. 


నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘ కార్యాలయంలో కవి,ఉపాధ్యాయులు బిల్ల మహేందర్ సంపాదకులుగా, డాక్టర్ ఏరుకొండ నరసింహుడు గౌరవ సంపాదకులుగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల వలస కార్మికులు పడిన వెతలను అక్షరీకరించిన రెండు తెలుగు రాష్ట్రాల లోని 110మంది కవుల కవిత్వ సంకలనం '"వలస దుఃఖం" పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. దొడ్డి కొమురయ్య ఫౌండేషన్ మరియు తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  డికెఎఫ్ అధ్యక్షులు అస్నాల శ్రీనివాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా. నందిని సిధారెడ్డి పుస్తకాన్నిఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కె.శ్రీనివాసు మాట్లాడుతూ...ఆధునిక భారత నిర్మాతలు వలకూలిలేననీ,ఒక వ్యవస్థ నడపడానికి నిలపడానికి అవసరమైన దినుసులు వారని,.మొత్తం మానవజాతి పురోగమనానికి దారులు వేసిన గొప్ప శక్తులైన వీరి జీవితాలు భారతదేశ నట్టనడివీధుల్లో అనాథైపోయిందన్నారు.ఇవ్వాల కార్మికుల్ని,పేదల్ని,అణగారిన వర్గాలను చావుకు సిద్ధం చేయడం,ప్రజావ్యతిరేఖ విధానాలను యధేచ్చగా అమలులోకి తీసుకరావడం పాలకులు కరోనా చాటు చేసుకొని చేస్తున్నారని అన్నారు.

Latest Videos

నందిని సిధారెడ్డి మాట్లాడుతూ... ఈ నేపథ్యంలో మనుషులు మారినట్టుగా కనిపిసస్తున్నారు గానీ ఏమి మారలేదని,భయపడుతున్నట్టు అనిపిస్తున్నారు గాని ఏ భయం లేదని అన్నారు.ఇటువంటి విపత్కర పరిస్థితులలో వలస దుఃఖాన్ని సంకలనంగా అచ్చువేసిన సంపాదవర్గాన్ని అభినందించారు.కార్యక్రమంలో టిఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి,మామిళ్ళ రాజేందర్ ,టిజివో హైదరాబాద్ అధ్యక్షులు డా.వెంకట్ గండూరి,కవులు నాళేశ్వరం శంకర్ ,కవి యాకూబ్ ,ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ,కవి వడ్డెబోయిన శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత దొడ్డికొమురయ్య వర్థంతి సందర్భంగా వారికి అతిథిలందరు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

తెలంగాణ సమకాలీన సాహిత్య సూచిక

సుప్రసిద్ధ సాహితీవేత్త, విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు గారి 80వ జన్మదినోత్సవం సందర్భంగా తెలంగాణ సమకాలీన సాహిత్య సూచికను సిద్ధం చేస్తున్నాం. ఈ సూచికకు  ఆచార్య ఎస్వీ రామారావు ప్రధాన సంపాదకులుగా, డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా. టి. శ్రీరంగస్వామి సహాయ సంపాదకులుగా వ్యవహరిస్తారు. సూచిక నిర్మాణం ప్రతి జిల్లాలో ఒక జిల్లా సంపాదకుల ఆధ్వర్యంలో జరుగుతుంది. సమకాలీన రచయితలు, కవులు తమ పూర్తి పేరు, జన్మ తేదీ, జన్మ స్థలం, తల్లిదండ్రులు, నివాసం, ఫోన్ నెంబరు, ముద్రిత కాలం,  రచనల వివరాలతో పాటు తమ ఫోటోను కూడా ఈ నెల 25వ తేదీ లోగా కింద తెలిపిన విధంగా తమ జిల్లాల బాధ్యులకు పంపవలసిందిగా కోరుతున్నాం. కీర్తిశేషులైన రచయితల వివరాలు అవసరం లేదు. ఆ వివరాలను ఇప్పటికే గ్రంథరూపంలోకి తేవడం జరిగింది. 


మేడ్చల్, సంగారెడ్డి- రాయారావు సూర్యప్రకాశ్ రావు (9441046839), మెదక్- వామన మూర్తి (8919764218 ), సిద్దిపేట- మహేందర్ రెడ్డి (9959529555), వికారాబాద్- సుభ్యా (8639735218),  హైదరాబాద్- ఎం . శ్రీకాంత్ (9866570779), రంగారెడ్డి – బెల్లంకొండ సంపత్ కుమార్ (9908519151),  యాదాద్రి భువనగిరి – పోరెడ్డి  రంగయ్య (9948049864), నల్లగొండ – సాగర్ల సత్తయ్య (7989117415), సూర్యాపేట – బంగారు రామాచారి (994939111), మహబూబ్ నగర్- భీంపల్లి శ్రీకాంత్ (9032844017), వనపర్తి- గుంటి  గోపి (8019808207 ), నాగర్ కర్నూలు - వి. మధుసూదన శర్మ (9063887585 ), నారాయణపేట - కె. బాలస్వామి (9959653115 ), జోగుళాంబ గద్వాల – అంబటి భానుప్రకాశ్ (8897359699), నిజామాబాద్- ఘనపురం దేవేందర్ (9030033331 ), కామారెడ్డి- నమిలికొండ సునీత (9908468171 ), కరీంనగర్ - జి. లక్ష్మణ రావు (9849328036), జగిత్యాల- టి. శ్రీనివాస స్వామి (9440369939), పెద్దపల్లి- బుర్రా తిరుపతి (9963242525), రాజన్న సిరిసిల్ల – పత్తిపాక మోహన్  (9966229548), వరంగల్ అర్బన్ – టి. శ్రీరంగ స్వామి (99498579555), వరంగల్ రూరల్ – పల్లేరు వీరాస్వామి (9441602605), జనగామ- పానుగంటి రామమూర్తి (9490109599), జయశంకర్ భూపాలపల్లి- దహగం సాంబమూర్తి  (9440171746), మహబూబాబాద్- తండా హరీశ్  గౌడ్ (8978439551), ములుగు- అమ్మిన శ్రీనివాస రాజు (9441317694), ఖమ్మం- వురిమిళ్ల సునంద (9441815722), భద్రాద్రి కొత్తగూడెం – మండవ సుబ్బారావు (7013716255), ఆదిలాబాద్, ఆసిఫాబాద్ – తుమ్మూరి  రామమోహన రావు (9701522234 ), నిర్మల్- నేరెళ్ల హనుమంతు (9849247244 ), మంచిర్యాల- తోకల రాజేశం (9676761415)

- ఆచార్య ఎస్వీ రామారావు (9848012053), ప్రధాన సంపాదకులు
-  డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు (9441046839), సహాయ సంపాదకులు
-  డా.  టి. శ్రీరంగ స్వామి (99498579555), సహాయ సంపాదకులు

click me!