కవివరేణ్యా చంద్రబోస్ నీలో నేతాజీ చంద్రబోస్ ఆవహించాడా ! అంటూ ప్రొ. లక్ష్మీనారాయణ రాసిన కవిత ' శభాష్ చంద్రబోస్ ' ఇక్కడ చదవండి :
కవివరేణ్యా చంద్రబోస్
నీలో నేతాజీ చంద్రబోస్ ఆవహించాడా !
నాడు ఆ మహాయోధుడు
బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గజగజలాడించాడు
మరి నేడు నీవు సినిమాలో బ్రిటీష్ సార్వభౌమత్వాన్ని
సవాల్ చేసి నిలదీశావు
ఎర్రజొన్నల రొట్టె తొక్కు స్వయంగా తిన్నావు
ఎక్కడికి పోతుంది తెలంగాణ తేజం తెగింపు?
ఈ పోరాటాల పురిటిగడ్డపై పుట్టి పెరిగావు
ఈ యాసలోని పస ప్రాణశక్తి ప్రదర్శించావు
ఈ మట్టిబిడ్డగా కలం బలం బహిర్గతం చేశావు
ఎక్కడ భూపాలపల్లి ఎక్కడ ఆస్కార్ అమెరికా
అట్లాంటిక్ మహాసముద్రాలు దాటి మన తెలుగు ఆత్మగౌరవాన్ని
భూగోళంపై నిలిపావు
సినిమా పాటల్లో కూడా పదునైన ఈటెలుంటాయని ఎవరికి తెలియదు
ప్రాంతీయ భాషలోని సజీవ చైతన్యాన్ని విస్తృతం చేసి విశాల పరిచావు
ఈ నేల తల్లి నీ నుదుట శౌర్య తిలకం దిద్దుతుంది
నీ కన్నవారి ఆశీస్సులతో అనంత ఆకాశాల్ని తాకుతావు
మా అందరి ఆత్మీయ అభివందనలతో ఈ ప్రపంచం ప్రతిధ్వనిస్తుంది