పుట్టిన గిట్టిన తేదీలు పాలరాతి మీద చెక్కుతుంటే ఘోరీ నవ్వుతుంది - అంటూ కందుకూరి శ్రీరాములు రాసిన కవిత " అంతా బూడిదే! " ఇక్కడ చదవండి:
శూన్యం !
అంతా శూన్యం !
జీవమున్నంత సేపే
జవం !
అహం !
undefined
ధిక్కారమైనా
అధికారమైనా
మనుషులిట్లా ఎందుకయ్యారు ?
తోడు రారు
గోడు వినరు
ఎన్నాళ్ళీ గద్దెలు, మిద్దెలు -
తెర ఎత్తగానే
నాంది ప్రస్తావనలు -
ఉన్నంతసేపే వీధి భాగోతం !
తెరదించితే
మంగళ హారతే !
కండలన్నీ మాడిపోయి
కిరీటాలన్నీ కూరుకుపోయి
పుట్టిన గిట్టిన తేదీలు
పాలరాతి మీద చెక్కుతుంటే
ఘోరీ నవ్వుతుంది
ఎగిరితే పడిపోయేది
కింద నేనని,
ఏం మిగులుతుంది
చివరికి బూడిదేనని --